Microsoft : ఫ్రెషర్స్ కావలెను.. హైదరాబాద్ లొకేషన్ కోసం మైక్రోసాఫ్ట్ నియామకాలు
హైదరాబాద్ లొకేషన్ కోసం మైక్రోసాఫ్ట్ నియామకాలు | ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లొకేషన్ కోసం ఫ్రెషర్స్ నియామకాలను
ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లొకేషన్ కోసం ఫ్రెషర్స్ నియామకాలను ప్రారంభించింది. అంతర్జాతీయ ఐటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కు హైదరాబాద్‌లో పెద్ద ఆఫీసు ఉంది. ఇండియాకు ఇదే హెడ్ క్వార్టర్. ఇక్కడ కొన్ని వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 8 వేల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు.

సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫ్రెషర్స్ కోసం
తాజాగా ఫ్రెషర్స్ కోసం నియామకాలను కంపెనీ చేపట్టింది. మైక్రోసాఫ్ట్ ఆఫ్క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2021 పేరుతో ఈ నియామకాలను చేపడుతోంది. హైదరాబాద్ లొకేషన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోల్ కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, నోయిడా లొకేషన్లలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫ్రెషర్ ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపట్టింది. ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్లో అవగాహన ఉన్న ఫ్రెషర్స్ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
2022లో బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసేవాళ్లు కనీసం 7.5 / 10 సీబీపీఏ పాయింట్స్ సాధించిన వాళ్లు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. కోడింగ్‌లో కాస్త అనుభవం ఉండి.. క్వాలిటీ, సింప్లిసిటీ, డ్యూరబిలిటీ, మెయిన్టెనబిలిటీ కోడ్ రాయగలిగితే చాలు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్లస్. 6 నెలల లోపు మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఏ ఆఫ్క్యాంపస్ లేదా ఆన్‌క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొని ఉండకూడదు.
డేటా సైంటిస్ట్ రోల్ కోసం
సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోల్‌తో పాటు.. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా లొకేషన్లలో డేటా సైంటిస్ట్ రోల్ కోసం కూడా మైక్రోసాఫ్ట్ నియామకాలు ప్రారంభించింది. 2022లో బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) లేదా క్వాంటిటేటివ్ ఫీల్డ్‌లో 7.5/10 సీజీపీఏతో పూర్తి చేసేవాళ్లు ఈ రోల్‌కు అర్హులు.
ఇది డేటా సైంటిస్ట్ రోల్ కాబట్టి.. ఆర్ లేదా మాథ్ల్యాబ్ లేదా స్కిపీ లేదా పాండాస్ లేదా వెకా లేదా పెర్ల్, పైథాన్ లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద అనుభవం ఉండాలి.
హడూప్ లేదా హెచ్‌బేస్ లేదా పిగ్ లేదా మ్యాప్‌రెడ్యూస్ లేదా బిగ్టేబుల్ లేదా అజుర్ ఎంఎల్ మీద అనుభవం ఉంటే ఇంకా మంచిది. సీ ప్లస్ ప్లస్, సీ షాప్, డాట్ నెట్ గురించి అవగాహన ఉంటే రోల్‌కు ఇంకా ప్లస్ అవుతుంది.
ఈ రోల్స్ మాత్రమే కాదు.. ఇంకా చాలా రోల్స్ కోసం మైక్రోసాఫ్ట్ ఫ్రెషర్స్ నియామకాలను చేపట్టింది. మరిన్ని వివరాలను careers.microsoft.com వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OnePlus : పేలిన వన్‌ప్లస్ నోర్డ్2 5జీ ఫోన్.. కస్టమర్‌కు నష్టపరిహారం అందించిన కంపెనీ
Youtube : యూట్యూబ్‌లో ఇక ఆ ఫీచర్ కనిపించదు
చరిత్రలో ఈరోజు : 38 ఏండ్ల క్రితం ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ విండోస్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

