వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా మార్స్‌పైకి పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడి మేఘాల ఫొటోలను తీసి భూమిపైకి పంపింది. నిజానికి అరుణ గ్రహంపై వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. అక్కడ మేఘాలు ఏర్పడటం చాలా అరుదు. సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉన్న సమయంలో, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భంలో మార్స్ భూమధ్య రేఖ దగ్గర ఈ మేఘాలు కనిపిస్తాయి. అయితే ఈ మేఘాలు నాసా ఊహించినదాని కంటే ఎంతో ముందుగానే కనిపించడం విశేషం. ఒక మార్స్ ఏడాది (మనకు రెండేళ్లు) ముందే ఈ మేఘాలు నాసా క్యూరియాసిటీ రోవర్‌పై ఆవరించినట్లు సైంటిస్టులు గుర్తించారు.
క్యూరియాసిటీ రోవర్ పంపిన ఫొటోల్లో మార్స్‌పై ఏర్పడిన మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 5న క్యూరియాసిటీ రోవర్ ఈ ఫొటోలను తీసింది. రోవర్‌లోని మాస్ట్‌క్యామ్ వీటిని క్లిక్‌మనిపించింది. మార్చి 31న మరోసారి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను కూడా ఈ రోవర్ తీసింది. ఈ ఫొటోలను విశ్లేషించడం ద్వారా మార్స్‌పై అసలు మేఘాలు ఎలా ఏర్పడతాయి? తాజాగా ఏర్పడిన మేఘాలు మిగతా వాటి కంటే ఎలా భిన్నమైనవో తేలనుంది. 2012లో మార్స్‌పై దిగిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ మనుగడకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న అంశంపై అధ్యయనం చేస్తోంది.
Heading into the weekend like a cloud on Mars.
— Curiosity Rover (@MarsCuriosity) May 28, 2021
This GIF shows clouds drifting over Mount Sharp. Each frame was stitched together from six individual images. https://t.co/Gtgz9Iu822 (2/4) pic.twitter.com/VPvSri1Sdh
I wandered lonely as a cloud on Mars…
— Curiosity Rover (@MarsCuriosity) May 28, 2021
These are noctilucent or "night shining" clouds. They're high in the atmosphere and likely made of dry ice. Their crystals catch the fading light of the Sun, causing them to glow against the darkening sky. https://t.co/Gtgz9Iu822 (4/4) pic.twitter.com/LCcRibSGjx