TCS | వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీని వ్యతిరేకిస్తూ టీసీఎస్‌ను వీడుతున్న మహిళా టెకీలు
ఆఫీసులకు తిరిగివచ్చేందుకు ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతున్నాయని టీసీఎస్ (TCS )హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లకాడ్ చెబుతున్నారు.
TCS | కరోనా మహమ్మారి నెమ్మదించిన అనంతరం పలు కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాల బాట పట్టిస్తున్నా టెక్నాలజీ రంగంలో ఉద్యోగులు మాత్రం నూతన పాలసీకి సర్ధుబాటు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీకి మారేందుకు టెకీలు విముఖత చూపుతున్నారు. ఆఫీసులకు తిరిగివచ్చేందుకు ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతున్నాయని టీసీఎస్ (TCS )హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లకాడ్ చెబుతున్నారు.
ఆఫీసుకు తిరిగి రావాలని కంపెనీ కోరుతుండటంతో నిరాకరిస్తూ పెద్దసంఖ్యలో మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని కంపెనీ వార్షిక నివేదికలో లకాడ్ వెల్లడించారు. మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకే మొగ్గుచూపుతున్నారని, వారిని ఆఫీసులకు రావాలని కోరుతుండటంతో మహిళా టెకీలు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని తెలిపారు.
మహిళా ఉద్యోగుల నిష్క్రమణకు ఇదే కారణమని, వారి పట్ల ఎలాంటి వివక్ష లేదని చెప్పుకొచ్చారు. వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీని వ్యతిరేకిస్తూ ఎంతమంది మహిళా ఉద్యోగులు కంపెనీ నుంచి వైదొలిగారనే వివరాలను టీసీఎస్ వెల్లడించలేదు. సహజంగా టీసీఎస్‌లో మహిళల నిష్క్రమణ (అట్రిషన్) రేటు పురుషుల కంటే తక్కువగా ఉండటంతో తాజా పరిణామాలు అసాధారణమైనవని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక టీసీఎస్‌లో ఆరు లక్షల మందికి పైగా పనిచేస్తుండగా వీరిలో 35 శాతం మహిళా ఉద్యోగులు కాగా, వీరిలో 70 శాతం మంది కంపెనీలో ఉన్నత స్దానాల్లో ఉన్నారని టీసీఎస్ తెలిపింది.
Read More
Better.com | టెక్ ప్రపంచంలో కొనసాగుతున్న లేఆఫ్స్ : 4000 మందిపై బెటర్.కాం వేటు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

