Lenovo Yoga Tab Plus | కోవిడ్ సమయం నుంచి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించడం, విద్యకు సంబంధించిన పనులను చక్కబెట్టుకోవడం ఎక్కువైంది. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్లతోపాటు ట్యాబ్‌ల వాడకం కూడా ఎక్కువైంది. ప్రస్తుతం చాలా మంది కేవలం చదువుకోవడం కోసమే కాకుండా, పని చేసేందుకు కూడా ట్యాబ్‌లను కొనుగోలు చేస్తున్నారు. తయారీ కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచుల మేరకు ట్యాబ్‌లను రూపొందించి అందిస్తున్నాయి. అందులో భాగంగానే లెనోవో కూడా ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత్‌లో లేటెస్ట్గా లాంచ్ చేసింది. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ పేరిట లాంచ్ అయిన ఈ ట్యాబ్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 12.7 ఇంచుల 3కె డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 10200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఇందులో ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు కలిగిన తొలి లెనోవో ట్యాబ్ ఇదే కావడం విశేషం. లెనోవో ఏఐ పేరిట ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఆడియో క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ట్యాబ్‌కు గాను లెనోవో ట్యాబ్ పెన్ స్టైలస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. 2 ఇన్ 1 కీబోర్డ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు గాను 3 మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్‌ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని లెనోవో తెలియజేసింది.
ఈ ట్యాబ్‌లో షేర్ హబ్ పేరిట ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో చాలా సులభంగా ఫోన్లు, ఇతర ట్యాబ్లెట్లకు ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. పీసీకి కూడా చాలా సులభంగా ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు. అలాగే యాప్ స్ట్రీమింగ్ అనే ఫీచర్ ద్వారా ఈ ట్యాబ్‌లోని యాప్‌లను పీసీలో స్ట్రీమ్ చేయవచ్చు. స్మార్ట్ క్లిప్‌బోర్డ్ అనే ఫీచర్ ద్వారా కంటెంట్‌ను ఇతర డివైస్‌లకు చాలా సులభంగా కాపీ చేయవచ్చు. ఈ ట్యాబ్‌లో 16జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 256 జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. పవర్ కీ మీదనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.
యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ట్యాబ్ సపోర్ట్ చేస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఇందులో పొందవచ్చు. ఈ ట్యాబ్‌లో ఉన్న బ్యాటరీకి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. లెనోవో ఏఐ నౌ, ఏఐ నోట్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్, గూగుల్ జెమిని యాప్, సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్, లెనోవో స్మార్ట్ కనెక్ట్, అడోబ్ లైట్ రూమ్ వంటి యాప్స్‌ను ఇందులో అందిస్తున్నారు. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ ఏఐ ట్యాబ్లెట్ టైడల్ టీల్ కలర్ ఆప్షన్లో లాంచ్ అయింది. దీనికి పెన్, కీబోర్డును కూడా అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.44,999 ఉండగా, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.47,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను లెనోవో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు అమెజాన్‌లోనూ విక్రయిస్తున్నారు.