న్యూఢిల్లీ : దసరా వేడుకల్లో భాగంగా అమెజాన్ మరో సేల్ ఈవెంట్‌తో ముందుకొచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు కొనసాగింపుగా కంపెనీ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరిట దివాళీ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 సహా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
అమెజాన్‌లో ఈ 5జీ ఫోన్ రూ 2000 తక్కువకు 64జీబీ స్టోరేజ్ మోడల్ రూ 11,999 నుంచి అందుబాటులో ఉండగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై మరో రూ 1250 డిస్కౌంట్ లభిస్తోంది. వీటికి తోడు పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో డివైజ్ ధర భారీగా తగ్గనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ అమెజాన్‌పై తక్కువ ధరకు లభిస్తున్న 5జీ ఫోన్‌గా కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 6.5 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది.
బడ్జెట్ శామ్సంగ్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌ను కలిగిఉంది. 15డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ ఒక్కటే నిరాశపరిచినా ఈ ధరలో ఇతర ఫీచర్ల పరంగా 5జీ ఫోన్ అందుబాటులో ఉండటం సానుకూల అంశంగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దివాళీ సేల్‌లో పోకో ఎం4 5జీ, రెడ్మి నోట్ 11టీ, ఐక్యూఓఓ జడ్6 వంటి ఇతర బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లు కూడా తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి.