JioBook : మరో సంచలనానికి సన్నద్ధం అవుతున్న జియో.. ఈసారి ఏం లాంచ్ చేయబోతోందంటే?
మరో సంచలనానికి సన్నద్ధం అవుతున్న జియో | జియో అంటేనే సంచలనం. సరిగ్గా ఐదేళ్ల ముందు.. జియో పేరుతో సరికొత్త నెట్‌వర్క్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి
జియో అంటేనే సంచలనం. సరిగ్గా ఐదేళ్ల ముందు.. జియో పేరుతో సరికొత్త నెట్‌వర్క్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి.. సంచలనం సృష్టించింది జియో. ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఇచ్చి.. టెలికం రంగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ.. జియోనే నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది.

ఆ తర్వాత జియో ఫోన్.. త్వరలో జియోఫోన్ నెక్స్ట్ అనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్న జియో.. జియోఫోన్ నెక్స్ట్‌తో పాటు.. అత్యంత చౌకైన ల్యాప్‌టాప్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
జియో.. ఏం చేసినా.. సగటు మధ్య తరగతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ధర కన్నా కూడా తక్కువ ధరకే తన ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తుంటుంది. అందుకే.. జియో ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా దిగువ, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు.
జియో నుంచి జియోబుక్ పేరుతో త్వరలోనే మూడు వేరియంట్లలో ల్యాప్‌టాప్‌లు విడుదల కానున్నాయి. జియోబుక్ ల్యాప్‌టాప్‌లో అత్యాధునికమైన ఫీచర్లు కూడా ఉన్నాయట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెబ్సైట్లో జియో ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హెచ్డీ డిస్ప్లే, మినీ హెచ్డీఎంఐ కనెక్టర్, డ్యూయల్ బాండ్ వైఫై, బ్లూటూత్ లాంటి ఫీచర్లతో జియోబుక్ విడుదల కానుంది.
అలాగే.. జియోబుక్‌లో జియోస్టోర్, జియోమీట్, జియోపేజెస్ అనే యాప్స్ ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఓఎస్‌తో పాటు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్లు కూడా జియోబుక్‌లో ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి.
అయితే.. జియోబుక్ ల్యాప్‌టాప్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. జియోబుక్ ధర కూడా సాధారణంగా మార్కెట్లో దొరికే ల్యాప్‌టాప్‌ల కన్నా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. జియో ఏజీఎం మీటింగ్‌లోనే జియోబుక్‌ను లాంచ్ చేయాలని జియో భావించినా అప్పుడు రిలీజ్ చేయలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
WhatsApp : వాట్సప్ చాట్ బ్యాకప్స్ ఇక సురక్షితం.. సరికొత్త టెక్నాలజీతో ఈ2ఈ ఎన్క్రిప్షన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

