వాట్సప్ అంటేనే చాటింగ్ కోసం వాయిస్, వీడియో కాల్స్ కోసం వాడుతుంటాం. ఇదివరకు అంటే ఫోన్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్నా.. డబ్బులు కట్ అయ్యేది. కానీ.. ఇప్పుడు ఫోన్లో కొంచెం డేటా ఉంటే చాలు.. వాట్సప్ ఓపెన్ చేసి.. కావాల్సినన్ని మెసేజ్‌లు పంపించుకోవచ్చు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే.. అవతలి వ్యక్తికి పంపించే మెసేజ్‌లు సురక్షితమేనా. చాట్ బ్యాకప్ తీసుకుంటే అవి ఎన్‌క్రిప్ట్ అవుతాయా? అని యూజర్లు తెగ టెన్షన్ పడేవారు. అందుకే.. వాట్సప్ చాట్స్ బ్యాకప్ ఇక నుంచి ఈ2ఈ ఎన్క్రిప్షన్ను ఫాలో అవనున్నాయి.
ఈ2ఈ ఎన్క్రిప్షన్ అంటే.. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నమాట. వాట్సప్ సెక్యూరిటీ, ప్రైవసీలో ఇదే మేజర్ డెవలప్మెంట్. ఎందుకంటే.. వాట్సప్ చాట్స్‌ను గూగుల్ డ్రైవ్‌లో కానీ.. ఐక్లౌడ్‌లో కానీ బ్యాకప్ చేస్తే అవి ఎన్‌క్రిప్ట్ కావు. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్‌లో వాట్సప్ చాట్.. ఎన్‌క్రిప్ట్ కాదు. దాని వల్ల.. ఆ చాట్‌ను ఇతరులు చదివే అవకాశం ఉంటుంది కాబట్టి.. వాట్సప్ చాట్ బ్యాకప్‌ను కూడా ఎన్‌క్రిప్ట్ చేస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది.
నిజానికి.. వాట్సప్ చాట్స్ అనేవి ఈ2ఈ ఎన్క్రిప్టెడ్. అంటే.. కేవలం.. ఆ మెసేజ్‌ను పంపించిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇద్దరు మాత్రమే దాన్ని చూడగలరు.. చదవగలరు. మిగితా వాళ్లకు ఆ మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ అయి కనిపిస్తాయి. వాట్సప్ చాట్ బ్యాకప్‌కు మాత్రం ఇప్పటి వరకు ఎన్క్రిప్షన్ లేదు. సెక్యూరిటీ పరంగా వచ్చే ఇబ్బందులను తెలుసుకున్న వాట్సప్.. తాజాగా ఈ2ఈ ఎన్క్రిప్షన్ను గూగుల్ డ్రైవ్, యాపిల్ ఐక్లౌడ్‌కు విస్తరింపజేసింది.
దాని కోసమే.. వాట్సప్ సరికొత్త సిస్టమ్‌ను డెవలప్ చేసింది. దాన్నే కీ స్టోరేజ్ అంటారు. ఐవోఎస్, ఆండ్రాయిడ్.. రెండు ఓఎస్‌లలో ఇది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే వాట్సప్ చాట్‌ను.. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్లలో బ్యాకప్ చేస్తారో.. వెంటనే అవి యూనిక్, ఎన్క్రిప్టెడ్ కీని జనరేట్ చేసి.. బ్యాకప్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తాయి. మాన్యువల్‌గా కూడా కీని సెట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో కీని సెట్ చేసుకుంటే.. బ్యాకప్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. తర్వాత ఆ బ్యాకప్‌ను యాక్సెస్ చేసుకోవాలంటే.. ఎన్క్రిప్షన్ కీతోనే యాక్సెస్ చేసుకోవాలి.
పాస్వర్డ్ సెట్ చేసుకుంటే.. హెచ్ఎస్ఎమ్(HSM) కాంపొనెంట్‌లో బ్యాకప్ కీ స్టోర్ అవుతుంది
ఒకవేళ మాన్యువల్‌గా బ్యాకప్‌కు పాస్వర్డ్ సెట్ చేసుకుంటే.. హెచ్ఎస్ఎమ్ కాంపొనెంట్ ద్వారా బ్యాకప్ కీ వాల్ట్‌లో కీ స్టోర్ అవుతుంది. హెచ్ఎస్ఎమ్ అనే హార్డ్‌వేర్‌ను ఎన్క్రిప్టెడ్ కీలను స్టోర్ చేసేందుకు వాడుతారు.
హెచ్ఎస్ఎమ్ కీ అనేది పాస్‌వర్డ్‌ను ప్రొటెక్ట్ చేస్తుంటుంది. పాస్వర్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను కూడా అదే చూసుకుంటుంది. రాంగ్ పాస్వర్డ్ అటెంప్ట్ చేస్తే.. వెంటనే కీని లాక్ చేసేస్తుంది హెచ్ఎస్ఎమ్. ఒకవేళ.. గూగుల్ డ్రైవ్ లేదా యాపిల్ ఐక్లౌడ్ అకౌంట్లు హ్యాక్ అయినా కూడా.. వాట్సప్ చాట్ బ్యాకప్స్‌ను మాత్రం హ్యాకర్లు డీక్రిప్ట్ చేయలేరు. హెచ్ఎస్ఎమ్ బేస్ కీని హ్యాక్ చేయలేరు కాబట్టి.. వాట్సప్ చాట్ బ్యాకప్‌కు ఎటువంటి సమస్య ఉండదు. అవి భద్రంగానే ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
CoWIN New API : కోవిన్ యాప్ లో కొత్త అప్ డేట్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటు అది కూడా
Over The Air Wireless Charging : ఒకేసారి 4 ఫోన్లకు చార్జింగ్.. మోటరోలా సరికొత్త ఎయిర్ చార్జర్