Itel Zeno 20 | అత్యంత చవక ధరకే స్మార్ట్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీకోసమే ఐటెల్ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐటెల్ జెనో 20 పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ ధర చాలా తక్కువగా ఉండడమే కాదు, ఆకట్టుకునే ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన జెనో 10 ఫోన్‌కు కొనసాగింపుగా ఐటెల్ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఐటెల్ జెనో 20 ఫోన్‌కు గాను ఐపీ 54 స్ల్పాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఒక బండిల్ కేస్ కూడా లభిస్తుంది. దీని వల్ల ఫోన్ అనుకోకుండా కింద పడినా ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ ఫోన్లో 6.6 ఇంచుల ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. వాటర్ డ్రాప్ స్టైల్లో ఒక నాచ్ ను కూడా ఇచ్చారు.
ఈ ఫోన్లో ఆక్టాకోర్ టి7100 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌ను 3 ఏళ్ల పాటు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆపరేట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి హెచ్డీఆర్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 5000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. డీటీఎస్ సౌండ్ ఫీచర్ కూడా లభిస్తుంది. అందువల్ల ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో అయివానా 2.0 పేరిట ఓ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందిస్తున్నారు. హిందీ కమాండ్లకు ఇది సపోర్ట్‌ను ఇస్తుంది.
వాయిస్ అసిస్టెంట్ సహాయంతో యూజర్ వాయిస్ కమాండ్లను ఇవ్వవచ్చు. దీని సహాయంతో యాప్‌లను ఓపెన్ చేయడం, వాట్సాప్ కాల్స్ చేసుకోవడం, ఇమేజ్‌లను గుర్తించడం, గణిత సమస్యలను పరిష్కరించడం, వాయిస్ ఇన్పుట్ ద్వారా క్యాప్షన్లను జనరేట్ చేయడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. అందువల్ల ఫోన్లో చాలా తక్కువ స్టోరేజ్‌ను తీసుకోవడమే కాదు, ఫోన్ వేగంగా కూడా పనిచేస్తుంది. ఈ ఫోన్లో ఫైండ్ మై ఫోన్, ల్యాండ్ స్కేప్ మోడ్, డైనమిక్ బార్ వంటి అదనపు ఫీచర్లను సైతం అందిస్తున్నారు. 3జీబీ, 4జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ర్యామ్‌ను అదనంగా మరో 5జీబీ నుంచి 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. స్టోరేజ్ ను మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
3.5ఎంఎం ఆడియో జాక్‌ను కూడా ఈ ఫోన్లో ఇచ్చారు. ఫేస్ అన్‌లాక్‌కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు కోసం ప్రత్యేకంగా ఒక స్లాట్‌ను ఇచ్చారు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫోన్లో 5జి లేదు. కేవలం 4జి సేవలు మాత్రమే వాడుకోవచ్చు. ఐటెల్ జెనో 20 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.5,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,899గా ఉంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. బేస్ మోడల్‌పై రూ.250, మరో మోడల్‌పై రూ.300 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌ను కేవలం అమెజాన్ సైట్లో మాత్రమే విక్రయించనున్నారు. ఆగస్టు 25 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. స్టార్‌లైట్ బ్లాక్, స్పేస్ టైటానియం, అరోరా బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే 4జి సేవలు, బేసిక్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చాలని భావించే వారికి ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.