
పాస్‌వర్డ్ పెట్టుకొనేందుకు సాధారణంగా ఎక్కువ మంది వాడే అక్షరాలు, సంఖ్యలు, సంకేతాలను ఆధారంగా చేసుకొని హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌ను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు. దీన్ని ‘బ్రూట్ ఫోర్స్ ఎటాక్’ అంటారు.

బ్రూట్ ఫోర్స్ ఎటాక్ బారిన పడకూడదంటే మన పాస్‌వర్డ్‌ను వీలైనంత ఎక్కువ పొడవు ఉండేలా చూసుకోవాలి.

సాధారణంగా వాడే పదాలు పాస్‌వర్డ్‌లో లేకుండా చూసుకోవాలి. అంటే డిక్షనరీలో నేరుగా దొరికేలా కాకుండా గ్రమటికల్‌గా తప్పులు, పదంలోని అక్షర క్రమంలో మార్పు ఉండేలా చూసుకోవాలి. కీబోర్డులోని వరుస అక్షరాలను పెట్టుకోవడం ప్రమాదకరం.

మీరు పెట్టుకునే పాస్‌వర్డ్‌లో తప్పకుండా కనీసం ఒక నంబర్, సింబల్, అప్పర్‌కేస్, లోయర్ కేస్ ఉండేలా చూసుకోవాలి.

పాస్‌వర్డ్‌లో చాలా మంది ఇంటిపేరు, వాళ్ల ముద్దుపేర్లు, పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరాలు, పిల్లల పుట్టిన తేదీలు పెడుతుంటారు. ఇలా చేయకపోవడం ఉత్తమం. మీ వ్యక్తిగత సమాచారాన్ని పాస్‌వర్డ్‌లో పెట్టుకొంటే ఇతరులు సులభంగా తెలుసుకొనే వీలుంటుంది.

కొందరు ఈ-మెయిల్‌కు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, సోషల్ మీడియా ఖాతాలకూ ఒకే పాస్‌వర్డ్‌ను వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మన ఒక్క అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనా మిగిలిన ఖాతాలూ చిక్కుతాయి.

మార్కెట్‌లో మనకు పాస్‌వర్డ్ మేనేజర్ సర్వీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో స్ట్రాంగ్‌పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసుకోవచ్చు. మన పాస్‌వర్డ్‌లను ఎన్‌క్రిప్టెడ్ విధానంలో వీరు దాస్తారు. దీని వాడకంపై అవగాహన ఉండాలి. మన మాస్టర్ పాస్‌వర్డ్‌ను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు.

పాస్‌వర్డ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. డివైజ్‌లలో పాస్‌వర్డ్‌ను టైప్ చేసేప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి.

మీ కంప్యూటర్లు, ఈ మెయిల్ ఖాతాల్లో పాస్‌వర్డ్‌లను పెట్టుకోకూడదు. అలా స్టోర్ చేసుకోవల్సి వస్తే పాస్‌వర్డ్‌లోని హింట్ (మీకు గుర్తుండే) పదాలను మాత్రమే రాసుకోవడం ఉత్తమం.

మీ పాస్‌వర్డ్‌లను తరచూ మారుస్తూ ఉండాలి. కొందరు ఏండ్ల కొద్ది ఒకే పాస్‌వర్డ్‌ను వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒకసారి వాడిన పాస్‌వర్డ్‌ను మరలా చాలా కాలం వరకు వాడకపోవడమే ఉత్తమం
RELATED GALLERY
-
Naya Mall | అమ్మాయిలు జీరో సైజ్ కోసం ఆరాటపడ్డట్టే.. హ్యాండ్ బ్యాగులు కూడా ఇలా సైజ్ తగ్గించుకుని వచ్చేస్తున్నాయ్!
-
Redmi Note 13 | అద్భుతమైన కెమెరా సెన్సర్లతో బడ్జెట్ ధరలోనే రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు. .ఇవీ స్పెషిఫికేషన్స్..?!
-
Lava Blaze Pro 5G | లావా నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో 5జీ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
-
You-Tube Create | యూ-ట్యూబ్ గుడ్ న్యూస్.. సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్..!
-
Phonepe App Store | ఫోన్‌పేలో ‘యాప్ స్టోర్’.. ఉచితంగా అప్లోడ్ చేసుకోవచ్చు..!
-
Samsung Galaxy S23 FE 5G | శాంసంగ్ నుంచి త్వరలో భారత్ మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ.. ఇవీ డిటైల్స్..?!