న్యూఢిల్లీ : కొత్త ఏడాది లాంఛ్ కానున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఎన్నో రిపోర్ట్స్, లీకులు వెల్లడవుతున్నాయి. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్‌ను తక్కువ ధరకే అందించాలని యాపిల్ కసరత్తు సాగిస్తోందనే వార్తలు రాగా, తాజాగా ఐఫోన్ 15 మోడల్ బ్యాటరీ లైఫ్‌పై మరో రిపోర్ట్ పలు వివరాలు వెల్లడించింది. ఐఫోన్ 15 యాపిల్ న్యూ ఏ17 చిప్సెట్తో రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
న్యూ చిప్ కారణంగా ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే అప్‌కమింగ్ వెర్షన్ ఐఫోన్ 15 మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. న్యూ చిప్స్ 35 శాతం తక్కువ పవర్‌ను వాడతాయని దీంతో ఐఫోన్ 15 మోడల్ యూజర్లకు అధిక బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేయనుంది.
ఈ ఏడాది ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో చూసిన డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో ఐఫోన్ 15 కస్టమర్ల ముందుకొస్తుందని చెబుతున్నారు. ఇక యూరోపియన్ చట్టాలకు అనుగుణంగా నూతన తరం ఐఫోన్లు యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్‌ను సపోర్ట్ చేయనున్నాయి.