iPhone 14 | ఇటీవలే సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఈ సిరీస్ లాంచ్ అయింది. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌లో హైఎండ్ ఫీచర్లతో కాస్ట్లీ ఫోన్‌గా ఎస్22 సిరీస్ లాంచ్ అయింది. దీంతో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ పోటీని తట్టుకోవడం కోసం యాపిల్ సంస్థ.. ఐఫోన్ 14 ప్రోను బెస్ట్ ఫీచర్లతో తీసుకురానుంది.
టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు 6 జీబీ ర్యామ్‌తోనే విడుదలయ్యాయి. కానీ.. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఐపాడ్ ప్రో 2021 మోడల్లో యాపిల్ 16 జీబీ ర్యామ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ బేసిక్ మోడలే 8 జీబీ ర్యామ్‌ను అందిస్తుండటంతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8 జీబీ ర్యామ్‌ను అందించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఐఫోన్ 14 లాంచ్ డేట్, ఫీచర్ల గురించి యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు.