న్యూఢిల్లీ : సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ కానుండగా అధికారిక లాంఛ్‌కు ఒక రోజు ముందు ఐఫోన్ 14 తాజా వివరాలు లీకయ్యాయి. నాలుగు మోడల్స్‌కు సంబంధించి పలు వివరాలు లీకయ్యాయి. ఇక వీటిలో ప్రధానంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ ఏ16 బయోనిక్ చిప్‌తో కాకుండా మెరుగుపరిచిన ఏ15 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానున్నాయని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో రానున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
టెక్ పరిశ్రమ అంతటా చిప్ కొరత వెంటాడుతుండటంతోనే ఐఫోన్ 14 అఫర్డబుల్ మోడల్స్‌లో అత్యాధునిక ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడటం లేదని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు విడిపరికరాల ధరలు పెరగడం కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఐఫోన్ 13 ధరలకే ఐఫోన్ 14 లభిస్తుందని కొందరు చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ వంటి నాలుగు మోడల్స్‌ను ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా యాపిల్ లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 13 డిజైన్‌నే ఐఫోన్ 14 పోలిఉంటుందని..భారీ బ్యాటరీ, మెరుగైన సామర్ధ్యం, యూజర్ ఎక్స్పీరియన్స్ కలిగిఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో కెమెరా ఫీచర్లలో అప్‌గ్రేడ్ ఉంటుందని తాజా అప్డేట్స్ వెల్లడించాయి.