న్యూఢిల్లీ : ఐఫోన్ 14 లాంఛ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ తొలి వారం లేదా రెండో వారంలో నిర్వహించేందుకు యాపిల్ సన్నాహాలు చేపట్టింది. సెప్టెంబర్ 6 లేదా సెప్టెంబర్ 13న ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్స్‌ను కంపెనీ లాంఛ్ చేయనుంది. ఇక ఐఫోన్ 13 సిరీస్‌ను పోలిన డిజైన్‌నే ఐఫోన్ 14 సిరీస్‌లోనూ అనుసరించవచ్చని చెబుతున్నారు.
ప్రొ మోడల్స్ మాత్రం తాజా డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ 14 మోడల్స్ అన్నీ అల్యూమినియం ఫ్రేమ్‌లతో కూడిన గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ఆకట్టుకోనున్నాయి. రెగ్యులర్ మోడల్ 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంటుంది. మెరుగైన అవుట్డోర్ వ్యూయింగ్ అనుభూతి కోసం హయ్యర్ పీక్ బ్రైట్నెస్ను ఐఫోన్ 14 సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్ ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.7 ఇంచ్ డిస్ప్లేతో రానున్నాయి.
ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ బయోనిక్ ఏ15 చిప్సెట్తో ముందుకు రానుంది. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్ అత్యాధునిక ఏ16 చిప్‌సెట్‌ను కలిగిఉంటాయి. ఐఫోన్ 14 సిరీస్ లేటెస్ట్ ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నాయి. ఇక ఐఫోన్ 14 సిరీస్ ధర విషయానికి వస్తే ఐఫోన్ 13 సిరీస్ తరహాలోనే లేటెస్ట్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తుండగా ఐఫోన్ 13 కంటే కొద్దిగా ఎక్కువ ధర ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 13 ఫోన్లు రూ 79,900 ప్రారంభ ధర నుంచి లభిస్తున్నాయి.