న్యూఢిల్లీ : ఐఫోన్ 14ను కొనుగోలు చేయాలనుకుని ఇప్పటివరకూ తమ డ్రీం ఫోన్‌ను సొంతం చేసుకోలేని వారికి ఇది మెరుగైన అవకాశంగా ముందుకొచ్చింది. జియోమార్ట్‌లో ఈ డివైజ్‌పై రూ 5000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఐఫోన్ 14 సిరీస్ భారత్‌లో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే.
ఐఫోన్ 14. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఐఫోన్ 14 రూ 79,900కు లిస్టవగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు రూ 5000 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. దీంతో ఐఫోన్ 14 రూ 74,900కు కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఇక వెల్కం ఆఫర్ కింద రూ 750 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 12, ఐఫోన్ 13లపైనా ఇదే తరహా డిస్కౌంట్లను జియోమార్ట్ ఆఫర్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో హెచ్డీఆర్ సపోర్ట్ చేసే డిస్ప్లేను కలిగిఉంది. ఐఫోన్ 14 ఏ15 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది.