ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి.. ఏసియాలోనే మొట్ట మొదటి ఫ్లయింగ్ కారును తీసుకొస్తున్న చెన్నై కంపెనీ

India’s first flying car | కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది కదూ ! ట్రాఫిక్‌లో ఎంతసేపటికీ కారు ముందుకు కదలకపోతే ఒక రేంజ్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలాంటి సమయంలో కారుతో సహా ఎగిరిపోగలిగితే ఎంత బావుంటుందని చాలా మందికి అనిపించే ఉంటుంది. ఇప్పటివరకు అది ఒక కల. కానీ ఇప్పుడు మనం దాన్ని నిజం చేసుకోవచ్చు. అవును !! ఇప్పుడు ఎగిరిపోయే కార్లు వచ్చేస్తున్నాయి. అది కూడా మన భారత్‌లోనే తయారవుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన స్టార్టప్ వినతా ఏరోమొబిలిటీ కంపెనీ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు ఎగిరే కారును తయారు చేస్తుంది. ఇది ఇండియాలోనే కాదు ఆసియాలోనే తయారవుతున్న మొట్ట మొదటి ఎగిరే కారు ఇదే కావడం విశేషం. లండన్‌లో జరగనున్న హెలిటెక్ ఎక్స్పో 2021లో ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు మోడల్‌ను, పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ కారు నమూనాను వినతా కంపెనీ.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు చూపించింది. ఈ మోడల్‌పై సింథియా కూడా సానుకూలంగా స్పందించారు. ఒకసారి ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రజా ప్రయాణంతో పాటు కార్గో, మెడికల్ ఎమర్జెన్సీ సేవల కోసం కూడా వినియోగించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కారు స్పెషాలిటీ ఏంటి?
ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు ముందు భాగం బుల్లెట్ ట్రైన్ డిజైన్‌లో ఉంటుంది. దీనికి నాలుగు చక్రాలతో పాటు.. గాలిలోకి ఎగిరేందుకు రెక్కలు కూడా ఉన్నాయి. కారు చుట్టూ నల్లటి గ్లాస్‌ను ఉపయోగించారు. అయితే ఈ ఫ్లయింగ్ కారు లోపలి భాగానికి సంబంధించిన నమూనాను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్‌లో లండన్‌లో జరగబోయే ఆటోమొబైల్ ఎక్స్‌పోలో ప్రకటించనున్నారు. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి సింథియాకు వినతా కంపెనీ అందించిన కాన్సెప్ట్ ప్రకారం.. ఈ కారు విద్యుత్తుతో పాటు బయో ఫ్యూయల్‌తో నడుస్తుంది. దీనివల్ల ఎగిరే సామర్థ్యం పెరుగుతుంది. ఈ కారులో ఇద్దరు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఈ కారు బరువు 1100 కిలోలు. గరిష్టంగా 1300 కిలోల వరకు మోసుకెళ్లగలదు. ఈ కారు గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ కారు రోటర్ కాన్ఫిగరేషన్ కో ఆక్సియల్ క్వాడ్ రోటర్. ఈ కారులో జీపీఎస్ ట్రాకర్, పనోరమిక్ విండో కూడా ఉంటాయి.
ఇంతకీ హైబ్రిడ్ కారు అంటే ఏంటి?
హైబ్రిడ్ కారు అంటే సాధారణ కారులాగే ఉంటుంది. కాకపోతే ఈ కారులో రెండు ఇంజిన్లు ఉంటాయి. అందులో ఒకటి పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడుస్తుంది. ఇంకొకటి ఎలక్ట్రిక్ మోటార్. ఇలా ఇంధనం, ఎలక్ట్రిక్ పద్ధతి రెండింటినీ వాడే టెక్నిక్‌నే హైబ్రిడ్ అంటారు. ఇప్పుడు చాలా కంపెనీలు ఇలాంటి కార్లపై పనిచేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mars Quake | వణికిన అరుణ గ్రహం.. మార్స్‌పై భారీ భూకంపం
Moon Tourism : ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
SpaceX | నెక్స్ట్ అంతరిక్ష ప్రయాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం: ఎలోన్ మస్క్
పేపరేస్తే తప్పేంటి..? బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

