న్యూఢిల్లీ : సేల్ సీజన్ నడుస్తుండటంతో షాపింగ్‌కు ఇదే బెస్ట్ సీజన్‌గా కస్టమర్లు భావిస్తున్నారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ సొంతం చేసుకునేందుకూ ఇదే సరైన సమయంగా ముందుకొచ్చింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. క్రోమాలో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీపై ఆకర్షణీయ డిస్కౌంట్లతో పాటు రూ 6000 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
డీల్‌లో భాగంగా ఐఫోన్ కొనుగోలు చేసిన కొద్దిరోజులకే కస్టమర్ క్రెడిట్ కార్డు ఖాతాలో క్యాష్‌బ్యాక్ జమవుతోంది. రూ 79,900 విలువైన ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ క్రోమాలో ప్రస్తుతం రూ 73,990కే లభిస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ఉన్నవారికి రూ 6000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
దీంతో ఐఫోన్ 13 డీల్‌పై కస్టమర్లు దాదాపు రూ 12,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ 13 ఈ ఆఫర్లపై కేవలం రూ 67,990కే కస్టమర్ల సొంతమవుతుంది. ఇక ఐఫోన్ 13 256జీబీ వేరియంట్ ధర రూ 89,900 కాగా రూ 8000 తగ్గింపుతో ఈ ఫోన్ రూ 81,990కే లభిస్తుంది. ఈ డీల్‌లో క్యాష్‌బ్యాక్‌తో కలుపుకుని కస్టమర్లకు ఏకంగా రూ 14,000 వరకూ ఆదా అవుతుంది.