How to Quit Smoking | అసలు స్మోకింగ్ మానేయడానికి.. ఈ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి సంబంధం ఏంటి అంటారా? ఉంది.. సంబంధం ఉంది.. అసలే కొత్త సంవత్సరం వచ్చింది. కనీసం ఈ సంవత్సరం అయినా స్మోకింగ్ మానేయాలని చాలామంది తీర్మానించుకుంటారు. అటువంటి వాళ్లు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా స్మోకింగ్‌ను మానేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూనే ఉంటారు. అటువంటి వాళ్లు ఈ యాప్స్‌ను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆ యాప్సే.. ఎలా స్మోకింగ్‌ను మానేయాలో సలహాలు అందిస్తాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ యాప్స్ ఉచితంగా లభిస్తాయి.
వాటిని వెంటనే ఇన్స్టాల్ చేసుకొండి. అందులో ఎక్స్పర్ట్స్ సలహాలు ఉంటాయి. స్మోకింగ్ చేస్తే డిటెక్ట్ చేసే సెన్సార్స్ ఉంటాయి. ప్రతి యాప్‌లో ఒక డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. మోటివేషనల్ కార్డ్స్ ఉంటాయి. వీటన్నింటి ద్వారా మోటివేట్ అయి ఖచ్చితంగా స్మోకింగ్ అలవాటును మానేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీకు కూడా స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే EasyQuit, Smoke Free, Kwit, QuitSure, QuitNow యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. పొగతాగడాన్ని పారద్రోలండి.