Spam Calls | స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? అనవసరపు ఫోన్లు రావొద్దంటే ఇలా చేయండి
Spam Calls | స్పామ్ కాల్స్ రాకుండా ఏం చేయాలి? అంటే ఫోన్లో ఉన్న ఈ చిన్న సెట్టింగ్స్‌ను చేంజ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి చాలావరకు బయటపడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Spam Calls | హాయ్ సర్.. మీకు పర్సనల్ లోన్ ఏమైనా కావాలా?, హాయ్ మేడమ్.. మీ క్రెడిట్ కార్డుపై అదిరిపోయే ఆఫర్ ఉంది చెప్పమంటారా? ఇలాంటి ఫోన్ కాల్స్ మనలో చాలామందికి వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఒక కాల్ అంటే ఫర్లేదు కానీ ఇలాంటి ఫోన్లు రోజుకి పది వస్తుంటాయి. వాళ్లు చెప్పిన ఆఫర్లు ఏమీ అక్కర్లేదని చెప్పినా వినిపించుకోరు. పదే పదే కాల్స్ చేసి విసిగిస్తుంటారు. అలా అని తెలియని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను లిఫ్ట్ చేయకుండా ఉందామంటే.. ఎవరైనా అవసరం కొద్దీ ఫోన్ చేస్తున్నారేమోనని లిఫ్ట్ చేస్తూనే ఉంటాం. తీరా అది స్పామ్ కాల్స్ అని తెలిశాక కోపం వచ్చినా ఏం చేయలేం.. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? స్పామ్ కాల్స్ రాకుండా ఏం చేయాలి? అంటే ఫోన్లో ఉన్న ఈ చిన్న సెట్టింగ్స్‌ను చేంజ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి చాలావరకు బయటపడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇలా కస్టమర్ కేర్ పేరిట వచ్చే కాల్స్‌ను ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి టెలీ మార్కెటింగ్ కాల్స్, రోబో కాల్స్, స్పామ్ కాల్స్. వీటిలో టెలీ మార్కెటింగ్, రోబోకాల్స్ మనకు విసుగు పుట్టిస్తాయి. మన సమయాన్ని తినేస్తాయి తప్ప వాటితో పెద్ద డేంజర్ ఏమీ ఉండదు. కానీ స్పామ్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ చేసిన వ్యక్తులు ఏవేవో మాయమాటలు చెప్పి మన అకౌంట్లో డబ్బులు కాజేయాలని చూస్తారు. అందుకే ఇలాంటి మోసాల నుంచి బయటపడేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఓ ఫీచర్ ఉంది. దాన్ని ఎనేబుల్చేసుకోవడం ద్వారా స్పామ్ కాల్స్ నుంచి రక్షణ పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..
♦ ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
♦ ఫోన్ యాప్ ఓపెన్ అయ్యాక కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కల పైన క్లిక్ చేయాలి.
♦ అప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అందులో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ అనే అప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.
♦ ఎనేబుల్ బటన్‌పై క్లిక్ చేయగానే మరోసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. దానికి ఒప్పుకోగానే మొబైల్లో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అయిపోతుంది.
♦ అప్పట్నుంచి దాదాపుగా స్పామ్ కాల్స్ రావడం తగ్గిపోతాయి.
♦ ఒకవేళ ఇంకా ఏవైనా నంబర్ల నుంచి స్పామ్ కాల్స్ వస్తే.. ఆ నంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు దానిపై రిపోర్ట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.
♦ అలా ఒక్కసారి రిపోర్ట్ చేస్తే ఆ నంబర్ నుంచి ఇక ఫోన్ కాల్స్ రావడాన్ని ఆపేస్తుంది.
Read More :
Whatsapp | వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..
రూ . 15,000 లోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..!
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

