Whatsapp | వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..
Whatsapp Call Link | వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పిస్తూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ కూడా ఇప్పుడు ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తీసుకొచ్చింది.
Whatsapp Call Link | గూగుల్ మీట్, జూమ్ కాల్స్, స్కైప్ వంటి యాప్స్‌లో ఉన్న గ్రూప్ కాలింగ్ ఫీచర్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆఫీసు మీటింగ్‌లను పెట్టుకునేందుకు ఈ ఫీచర్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పిస్తూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ కూడా ఇప్పుడు ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలువురు యూజర్లకు ప్రయోగాత్మకంగా అందించిన వాట్సాప్.. ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌ల్లో దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
♦ ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కాల్స్ సెక్షన్లోకి వెళ్లాలి
♦ కాల్స్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే.. అన్నిటికన్నా పైనా క్రియేట్ కాల్ లింక్ ( Create Call Link ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
♦ దానిపై క్లిక్ చేయగానే కాల్ టైప్ అడుగుతుంది. అందులో వీడియో లేదా వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ అలా కాల్ టైప్ సెలెక్ట్ చేసుకోగానే ఒక లింక్ క్రియేట్ అవుతుంది.
♦ ఆ లింక్‌ను ఇతరులకు పంపించేందుకు వీలుగా కాల్ టైప్ ఆప్షన్ కింద రెండు ఆప్షన్లు ఉంటాయి.
♦ షేర్ లింక్, కాపీ లింక్ అనే రెండు ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని.. అవసరమైన వారికి ఆ లింక్‌ను పంపించాలి.
♦ వాళ్లు సదరు లింక్‌పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ కాల్లో జాయిన్ అవ్వవచ్చు.
♦ ఒకవేళ సాంకేతికలోపం వల్ల వాట్సాప్ కాల్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఆ లింక్‌తో రీజాయిన్ అయ్యే సదుపాయం కూడా ఉంది.
♦ ఒక్కసారి క్రియేట్ చేసిన ఈ గ్రూప్ కాల్ లింక్‌ను 90 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.
Read More :
“WhatsApp | వాట్సాప్‌లో ‘ఆన్లైన్’ స్టేటస్ ఎలా దాచుకోవాలో తెలుసా?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

