WhatsApp | వాట్సాప్‌లో ‘ఆన్లైన్’ స్టేటస్ ఎలా దాచుకోవాలో తెలుసా?
WhatsApp | ప్రస్తుతం అత్యధిక శాతం మంది నిద్ర లేచిన దగ్గర నుంచి వాడే సోషల్ మీడియా యాప్ వాట్సాప్. అయితే దీనిలో ఒక సమస్య యూజర్లను ఇబ్బంది పెడుతుంది. మనం పొరపాటున ఒక్క సెకన్ పాటు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసినా కూడా.
ప్రస్తుతం అత్యధిక శాతం మంది నిద్ర లేచిన దగ్గర నుంచి వాడే సోషల్ మీడియా యాప్ వాట్సాప్. అయితే దీనిలో ఒక సమస్య యూజర్లను ఇబ్బంది పెడుతుంది. మనం పొరపాటున ఒక్క సెకన్ పాటు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసినా కూడా.. మన స్టేటస్ ‘ఆన్లైన్’ అని కాంటాక్ట్ లిస్టులోని వారందరికీ కనిపిస్తుంది. దీంతో మనం చాట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్లు అనుకుంటారు.
అదే సమయంలో మనం ఏదో పని చేసుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి, స్నేహితులు పంపిన మెసేజిలకు సమాధానం ఇవ్వకపోతే వాళ్లు చాలా హర్ట్ అయపోతారు. స్నేహాలు దెబ్బతింటాయి. అందుకే ఇకపై వాట్సాప్ వాడే సమయంలో ఇలా ఆన్లైన్, లాస్ట్ సీన్ స్టేటస్లు ఎవరికీ కనిపించకుండా దాచేయడం ఎలాగో ఒకసారి చూద్దామా?
1. ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కుడి వైపు ఐమూలగా ఉండే మూడు చుక్కల మెనూలోకి వెళ్లండి. అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.

2. దానిలో అకౌంట్ సెక్షన్లో ప్రైవసీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.

3. ఇక్కడ ‘లాస్ట్ సీన్’ లేదా ‘లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘హు కెన్ సీ మై లాస్ట్ సీన్’ కింద వచ్చిన ఆప్షన్లలో ‘నోబడీ’ అని సెలెక్ట్ చేశారంటే.. మీరు చివరగా ఆన్‌లైన్‌లోకి ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు.

నోట్: అయితే మనం చివరగా ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నదీ కొంత మందికి మాత్రమే తెలియకూడదని అనుకుంటే.. ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్..’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరెవరికి మన స్టేటస్ కనిపించకూడదని అనుకుంటున్నామో వాళ్ల కాంటాక్ట్ నంబర్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
4. అదే మెనూలో కిందివైపు మరో రెండు ఆప్షన్లు కనపడతాయి. ‘హు కెన్ సీ వెన్ ఐయామ్ ఆన్లైన్’ అనే కేటగిరీ కింద ఉంటాయీ ఆప్షన్లు. దీనిలో ‘ఎవ్రీవన్’ సెలెక్ట్ చేస్తే మనం ఆన్‌లైన్‌లోకి రాగానే అందరికీ తెలిసిపోతుంది. అదే ‘సేమ్ యాజ్ లాస్ట్ సీన్’ సెలెక్ట్ చేశారనుకోండి.. చివరగా మన స్టేటస్ ఎవరు చూశారో వాళ్లకే మనం ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో మనం చివరగా ఆన్‌లైన్‌లోకి ఎప్పుడు వచ్చామో ఎవరికీ కనిపించకుండా పైన సెట్ చేసుకున్నాం కాబట్టి.. ఇక మనం ఆన్‌లైన్‌లోకి వచ్చినా ఎవరికీ తెలియదన్నమాట.

ఇదే స్టెప్స్ ఫాలో అయ్యి ఐఫోన్లో కూడా వాట్సాప్ స్టేటస్‌ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు. తాజా అప్డేట్లో వాట్సాప్ వెబ్‌లో కూడా స్టేటస్‌ను దాచుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చిందీ సోషల్ మీడియా దిగ్గజం. వాట్సాప్ వెబ్‌లో పైన చెప్పిన విధంగానే సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

