How to Lock Facebook Profile : ఫ్రెండ్ లిస్ట్‌లో లేని యూజర్లు యాక్సెస్ చేసుకోకుండా ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోండిలా
ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోండిలా | ఫేస్బుక్ అనేది ఓపెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఫేస్బుక్లో ఉన్న యూజర్లు అందరినీ వాళ్ల
ఫేస్బుక్ అనేది ఓపెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఫేస్బుక్లో ఉన్న యూజర్లు అందరినీ వాళ్ల నేమ్‌తో సెర్చ్ చేసి వాళ్ల పోస్టులు అన్నీ చూడొచ్చు. ఇందులో ప్రైవసీ అంటూ ఏదీ ఉండదు. ఫ్రెండ్ లిస్ట్‌లో లేని యూజర్లు కూడా ఇతర ప్రొఫైల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ల పర్సనల్ డిటెయిల్స్, పోస్టులు, బయో అన్నీ చూడొచ్చు. ఇది ఖచ్చితంగా కొందరు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే అంశమే.

అందుకే.. ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం. యూజర్ తన ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకుంటే ఫ్రెండ్ లిస్టులో ఉన్నవాళ్లు తప్పితే ఇతర యూజర్లు ఎవ్వరూ ఆ పేజీని యాక్సెస్ చేసుకునే వీలు ఉండదు. దీని వల్ల.. ఫ్రెండ్ లిస్టులో లేని వాళ్లు లాక్ చేసుకున్న ఫేస్బుక్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేసుకోలేరు.
ఆండ్రాయిడ్ యూజర్లు ఫేస్బుక్ అకౌంట్‌ను లాక్ చేసుకోండిలా
ఫేస్బుక్ యాప్‌ను ఓపెన్ చేసి యాడ్ టు స్టోరీ(Add to Story) అనే ఆప్షన్ పక్కనే ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ Lock Profile అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే.. ప్రొఫైల్ లాక్కు సంబంధించిన సూచనలు అక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే.. You Locked Your Profile అనే పాప్అప్ విండో కనిపిస్తుంది. ఐఓఎస్‌లో ఫేస్బుక్ యాప్‌లో ప్రొఫైల్ లాక్కు సంబంధించిన ఆప్షన్స్ ప్రస్తుతానికి అయితే లేవు కానీ.. వెబ్ వర్షన్ ద్వారా మాత్రం ఫేస్బుక్ అకౌంట్‌ను లాక్ చేసుకోవచ్చు.

డెస్క్‌టాప్ ద్వారా ఎలా లాక్ చేసుకోవాలి
ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి సీ యువర్ ప్రొఫైల్ ఆనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక.. మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఒక డ్రాప్‌డౌన్ మెను ఓపెన్ అవుతుంది. అక్కడ లాక్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే.. వెంటనే అకౌంట్ లాక్ అయిపోతుంది. మళ్లీ ప్రొఫైల్‌ను అన్‌లాక్ చేసుకోవాలంటే.. సేమ్ అదే ప్రొసీజర్. మూడు డాట్స్ క్లిక్ చేసి.. అన్‌లాక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే చాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flipkart Big Billion Days 2021 : అక్టోబర్ 7 నుంచి 12 వరకు సేల్.. ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు
First e-Baby : ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
స్కూల్ చైర్‌తో మంటలార్పే డ్రోన్
Digital quality of life : డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో భారత్‌కు 59వ స్థానం
Android Malware : ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? సైబర్ క్రిమినల్స్ టార్గెట్ మీరే.. ఎలాగంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

