EPFO- Aadhaar Link : పీఎఫ్ – ఆధార్ లింక్.. సెప్టెంబర్ 1 లోపు చేసుకోకపోతే.. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే.. వెంటనే మీ పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోండి. ఇప్పటికే మీరు లింక్ చేసుకుంటే నో ప్రాబ్లమ్. ఒకవేళ.. ఇప్పటి వరకు ఆధార్‌తో పీఎఫ్ అకౌంట్‌ను లింక్ చేసుకోకపోతే మాత్రం వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే.. మీ పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేసుకోలేరు. సెప్టెంబర్ 1, 2021 లోపు ఆధార్‌తో పీఎఫ్ అకౌంట్‌ను లింక్ చేసుకోవాలి.

ఇప్పటికే.. కంపెనీలన్నింటికీ.. పీఎఫ్ సంస్థ.. ఎస్ఎంఎస్, మెయిట్స్, ఫోన్స్ ద్వారా పీఎఫ్, ఆధార్ లింక్ గురించి వివరించింది. ఇదివరకు ఈ గడువు జూన్ 1, 2021 వరకు మాత్రమే ఉండేది. కానీ.. మళ్లీ గడువును పెంచి.. సెప్టెంబర్ 1, 2021 వరకు డెడ్‌లైన్‌ను పెంచింది.
సెప్టెంబర్ 1 లోపు పీఎఫ్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేసుకోకపోతే.. కంపెనీ.. పీఎఫ్ ఖాతాలో జమచేసే నగదు కూడా జమ కాదు. అలాగే.. డబ్బులను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు.

పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్‌ను ఎలా లింక్ చేసుకోవాలి?
ముందు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ను(epfindia.gov.in) ఓపెన్ చేయండి. మీ పీఎఫ్ అకౌంట్ డిటెయిల్స్‌తో లాగిన్ అవండి. అక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్ ఉంటుంది. దానికింద ఈ కేవైసీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి.. ఆధార్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే.. వేరే పేజి ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీని వెరిఫై చేయమని అడుగుతుంది. మీరు ఆధార్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేశాక.. ఆధార్ నెంబర్.. పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయబడుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

