iOS 15 and iPadOS 15 : ఐవోఎస్ 15 వచ్చేసింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఏ మోడల్స్‌లో అప్‌గ్రేడ్ అవుతుంది?
ఐవోఎస్ 15 వచ్చేసింది | యాపిల్ కంపెనీ.. తాజాగా ఐవోఎస్ 15ను ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది
యాపిల్ కంపెనీ.. తాజాగా ఐవోఎస్ 15ను ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐవోఎస్ 15 తో పాటు.. ఐపాడ్ఓఎస్ 15, వాచ్ఓఎస్ 8ను కూడా యాపిల్ రిలీజ్ చేసింది. ఐవోఎస్ 15లో యాపిల్ సరికొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఫోకష్ మోడ్, లైవ్ టెక్స్ట్, షేర్‌ప్లే లాంటి ఫీచర్లను తీసుకొచ్చింది.

అలాగే.. ఐపాడ్ఓఎస్ 15లో స్క్రీన్ విడ్జెట్స్, ఫేస్‌టైమ్ అప్డేట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 20న రాత్రి 10.30 నుంచి(ఇండియన్ టైమ్) ఐవోఎస్ 15 యాపిల్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది.
ఐఫోన్ 6ఎస్ తో పాటు ఆ తర్వాత విడుదలైన అన్ని మోడల్స్‌లో ఐవోఎస్ 15 కంపాటిబుల్‌గా ఉంటుంది. iPhone SE (Gen 1), iPhone SE (2020), iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 8, iPhone 8 Plus, iPhone X, iPhone Xs, iPhone Xs Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max మోడల్స్‌లో ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13లో డీఫాల్ట్‌గా ఐవోఎస్ 15ను ఇన్స్టాల్ చేసి సేల్స్ ప్రారంభించనున్నారు.

ఒకవేళ మీ ఫోన్లో కొత్త అప్డేట్ గురించి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోతే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. జనరల్ అనే ఆప్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ను క్లిక్ చేసి ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

