Google AI | గూగుల్‌లో త్వరలో ఏఐ ఫీచర్.. సెర్చ్‌లో యూజర్ల ఇంటరాక్షన్ ఈజీ..
Google AI | త్వరలో గూగుల్ తన యూజర్లకు సెర్చింజన్ లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో యూజర్లు తాజా లాంగ్వేజ్ మోడల్ లో నేరుగా ఇంటరాక్ట్ కావచ్చు.
Google AI | చాట్‌జీపీటీ తరహాలో గూగుల్ కూడా తన సెర్చింజన్లో ఏఐ ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనున్నది. సెర్చ్ రిజల్స్‌లో వాస్తవిక, సాధారణ సంభాషణల స్వరంతో కూడి డేటా అందించడానికి గూగుల్ లాంబా ( LAMDA – Language Model for Dialog Application) అప్లికేషన్‌ను వినియోగించనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో మనం ప్రారంభ దశలోనే ఉన్నాం. అది త్వరలో ఉత్తమ ప్రొడక్ట్ కావాల్సి ఉంది` అని ఇటీవల డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. ఇంటర్నెట్ సెర్చ్‌లో తాజా లాంగ్వేజ్ మోడల్లో యూజర్లు నేరుగా ఏఐ చాట్‌బోట్‌తో ఇంటరాక్ట్ కావచ్చునన్నారు.
ఓపెన్ ఏఐ ( OpenAI ) స్టార్టప్ ఆధ్వర్యంలో నెటిజన్లకు అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. యూజర్లకు ఆకర్షణీయంగా డేటా అందిస్తున్న చాట్ జీపీటీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. దీనికి తోడు మైక్రోసాఫ్ట్ సాయంతో దూసుకెళ్తున్న చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సైతం ఆంథ్రోపిక్స్ అనే స్టార్టప్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టింది.
గ్లోబల్ టెక్ దిగ్గజాలు గత డిసెంబర్ త్రైమాసికంలో 34 శాతం లాభాలు కోల్పోయాయి. గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ ఎక్కువగా నష్టపోయింది. ఆదాయం, లాభాల్లో సమస్యలు తలెత్తడంతో సదరు టెక్ దిగ్గజాలు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజ సంస్థలు ఇంకా పొదుపు చర్యలకు గల మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నాయి. అమెజాన్, గూగుల్ అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా.. ఒక్కో సంస్థ పది వేల మందికి పైగా ఉద్యోగులను ఇండ్లకు పంపించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

