Google layoffs | మెరుగైన పనితీరు కనబరిచినా కనికరించని గూగుల్ : లేఆఫ్స్‌లో పెర్ఫామెన్స్నూ పట్టించుకోని టెక్ దిగ్గజం
మెరుగైన పనితీరు కనబరిస్తే లేఆఫ్స్ భయం ఉండదని, సరైన సామర్ధ్యం కొరవడిన వారిపైనే వేటువేస్తారనే అభిప్రాయం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. గూగుల్ ఇండియా (Google layoffs) ఉద్యోగి లింక్డిన్ పోస్ట్ ఇదే విషయం స్పష్టం చేస్తోంది.
న్యూఢిల్లీ : మెరుగైన పనితీరు కనబరిస్తే లేఆఫ్స్ భయం ఉండదని, సరైన సామర్ధ్యం కొరవడిన వారిపైనే వేటువేస్తారనే అభిప్రాయం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. గూగుల్ ఇండియా (Google layoffs) ఉద్యోగి లింక్డిన్ పోస్ట్ ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఆ పోస్ట్ వివరాల ప్రకారం సామర్ధ్యం ఆధారంగా లేఆఫ్స్ చోటుచేసుకోలేదు. అత్యధిక సామర్ధ్యం కనబరిచి హయ్యస్ట్ రేటింగ్ కలిగిన వారిని కూడా కంపెనీ విధుల నుంచి తొలగించింది.
గూగుల్ లేఆఫ్స్ సామర్ధ్యం ప్రాతిపదికన జరగలేదని ఆ ఉద్యోగి స్పష్టం చేశారు. గూగుల్ ఇండియా భారత్‌లో ఇటీవల 450 మందిని తొలగించగా ఈ లేఆఫ్స్ పెర్ఫామెన్స్ ఆధారంగా జరగలేదని చెప్పుకొచ్చారు. కొలువులు కోల్పోకుండా కంపెనీలో కొనసాగగలిగిన (నాతో సహా) వారంతా లేఆఫ్స్ బాధితుల కంటే మెరుగైన సామర్ధ్యం కలిగిఉండాల్సిన అవసరం లేదని లింక్డిన్ పోస్ట్‌లో సదరు ఉద్యోగి రాసుకొచ్చారు. అధిక రేటింగ్స్‌తో ఇటీవల పదోన్నతులు పొంది తనకు పరిచయమున్న వారు సైతం ఇటీవలి లేఆఫ్స్‌లో కొలువులు కోల్పోయారని ప్రస్తావించారు.
ఇక 15 ఏండ్లకు పైగా గూగుల్‌లో పనిచేస్తున్న మహిళ ఓరోజు ఉదయం లేస్తూనే అనూహ్యంగా టెక్ దిగ్గజంలో తన ఉద్యోగం కోల్పోయిన విషయం తెలుసుకున్నట్టు వెల్లడించారు. ఇక ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనం వెంటాడుతుండటంతో గూగుల్, అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ సహా పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. లాభాల నిర్వహణలో భాగంగా ఖర్చులకు కళ్లెం వేసే దిశగా తొలుత ఉద్యోగులపై వేటు వేసేందుకు మొగ్గుచూపుతున్నాయి.
Read More :
Meta layoffs 2023 | మెటా` మరో దఫా వేటు.. మార్చిలో 11 వేల మంది ఉద్వాసనకు రంగం సిద్ధం?!
Hackers | మీ డబ్బులు కొట్టేసేందుకు హ్యాకర్లు ట్రై చేస్తున్నారా? ఇలా కనుక్కొని వాళ్లను బురిడీ కొట్టించండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- India
- layoffs
- technology new
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

