Artemis Launch | ఫ్యూయల్ లీక్.. అర్టెమిస్ ప్రయోగం రెండోసారి వాయిదా!
Artemis Launch | ఇంధనం నింపుతుండగా ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ లీక్‌తో రెండోసారి `నాసా` అర్టెమిస్ ప్రయోగం వాయిదా పడింది.
Artemis Launch | చంద్రుడికిపైకి నాసా ప్రయోగించ తలపెట్టిన మానవ రహిత ఆర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగం మరోమారు వాయిదా పడింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉపగ్రహ వాహక నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్)లో శనివారం ఇంధనం నింపుతుండగా లీక్ సమస్య ఎదురైంది. ఇంజినీర్లు లిక్విడ్ హైడ్రోజన్ లీక్ కాకుండా నివారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని నాసా ట్వీట్ చేసింది. దీంతో అర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తారో వెల్లడించలేదు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడి స్పేస్ సెంటర్ నుంచి శనివారం మధ్యాహ్నం 2.17 (సాయంత్రం 18.17) గంటలకు అర్టెమిస్ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. అర్టెమిస్ ప్రయోగం కోసం ఫ్లోరిడా సమీప ప్రాంతాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల మంది ఆశలు అడియాసలు అయ్యాయి. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి లిక్విడ్ హైడ్రోజన్ లీక్ కావడంతోపాటు రాకెట్ నాలుగు ఇంజిన్లలో ఒకటి వేడిగా ఉందని సెన్సర్ గుర్తించింది. తాజాగా అర్టెమిస్ ప్రయోగం వాయిదా పడినందున తిరిగి ఈ నెల 19 వరకు ప్రయోగించే అవకాశాలు లేవని తెలుస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Artemis
- NASA
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

