Flipkart Freedom Sale 2025 | స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే కోవలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఓ నూతన సేల్‌ను ప్రారంభించింది. ఫ్రీడం సేల్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేసింది. ఈ సేల్‌లో భాగంగా అనేక రకాల ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను, రాయితీలను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ సేల్ ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుందని ఫ్లిప్ కార్ట్ తెలియజేసింది. మొబైల్స్, ల్యాప్ టాప్లతోపాటు పలు ఇతర ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా వన్ ప్లస్ ప్యాడ్ లైట్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను రూ.12,990 ధరకు కొనవచ్చు. షియోమీ ప్యాడ్ 7 ఆండ్రాయిడ్ ట్యాబ్ ధర రూ.34,999 ఉండగా దీన్ని ఈ సేల్‌లో రూ.21,999 ధరకు అందిస్తున్నారు.
ఈ సేల్‌లో రియల్‌మి ప్యాడ్ 2 లైట్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను రూ.10,749కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.20,999 గా ఉంది. ఏసర్ ఐకానియా ట్యాబ్ ధర రూ.29,999 ఉండగా రూ.22,999 ధరకు అందిస్తున్నారు. రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ ట్యాబ్ ధర రూ.19,999 ఉండగా, రూ.11,999 ధరకు అందిస్తున్నారు. వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్ ధర రూ.19,999 ఉండగా, రూ.14,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐప్యాడ్ ఎ16 ట్యాబ్ ధర రూ.34,900 ఉండగా రూ.31,990 కి కొనవచ్చు. రియల్‌మి ప్యాడ్ 2 లైట్ ట్యాబ్ ధర రూ.28,999 ఉండగా, రూ.12,149కు లభిస్తోంది.
పోకో ప్యాడ్ 5జి ట్యాబ్ ధర రూ.30,999 ఉండగా, రూ.18,999 కే కొనవచ్చు. ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ధర రూ.19,499 ఉండగా, రూ.11,399కి కొనుగోలు చేయవచ్చు. లెనోవో ట్యాబ్ ప్లస్ ట్యాబ్ ధర రూ.19,499 ఉండగా, రూ.11,999 కి కొనవచ్చు. ఇలా పలు రకాల కంపెనీలకు చెందిన ట్యాబ్‌లను ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అలాగే పలు ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఐఫోన్ 16ను రూ.69,999కు కొనవచ్చు. దీని అసలు ధర రూ.79,900 గా ఉంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యుషన్ ఫోన్‌ను రూ.20,999కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ని రూ.35,999 ధరకు, గెలాక్సీ ఎస్24 ఫోన్‌ను రూ.46,999 ధరకు కొనవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ఇ ఫోన్‌ను రూ.54,900 ధరకు కొనవచ్చు. అలాగే నథింగ్ ఫోన్ 3ఎ రూ.21,999కు, వివో టి4 5జి ఫోన్ రూ.20,999 ధరకు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు మరిన్ని అదనపు డీల్స్‌ను, రాయితీలను పొందవచ్చని ఆ సంస్థ తెలియజేసింది.