Elon Musk | రెండేండ్ల కనిష్టానికి ఎలన్‌మస్క్ సంపద.. ఎందుకంటే?!
Elon Musk | టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో మంగళవారం ఎలన్‌మస్క్ సంపద 7.7 బిలియన్ డాలర్లు నష్టపోయి, రెండేండ్ల కనిష్టం 148 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
Elon Musk | ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్.. ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. సోషల్ మీడియా దిగ్గజం జెయింట్ ట్విట్టర్ టేకోవర్ చేయడానికి టెస్లా షేర్లు విక్రయించిన ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద హరించుకుపోతూనే ఉన్నది.
అందుకే వరల్డ్ బిలియనీర్ల జాబితాలో తొలి కుబేరుడన్న పేరు సంపాదించుకున్న ఎలన్‌మస్క్.. ఇటీవలే ఆ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు. తాజాగా మంగళవారం రూ.63.77 వేల కోట్లు (7.7 బిలియన్ల డాలర్లు) ఆవిరయ్యాయి. గత అక్టోబర్ తర్వాత టెస్లా స్టాక్స్ ఒక్కరోజులో అత్యధికంగా పతనం కావడం ఇదే ప్రధమం.
గతేడాది ఎలన్‌మస్క్ సంపాదించిన దానికంటే ఎక్కువగా ఈ ఏడాది 122.6 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదను కోల్పోయారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంపద కూడగట్టుకున్న వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద 148 బిలియన్ల డాలర్లు మాత్రమే. ఇది రెండేండ్ల కనిష్టానికి సమానం.
బ్లూంబర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం ఎలన్ మస్క్.. బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రపంచంలోనే తొలి కుబేరుడిగా లగ్జరీ వస్తువుల బ్రాండ్ ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అరాల్ట్ నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ వ్యక్తిగత సందప 161 బిలియన్ డాలర్లు. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతం అదానీ వ్యక్తిగత ఆదాయం 127 బిలియన్ డాలర్లతో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.
టెస్లా షేర్లు, ఆప్షన్ల రూపంలోనే ఎలన్‌మస్క్ సంపద అత్యధికంగా ఉంది. గత అక్టోబర్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ఎలన్‌మస్క్.. అందుకు అవసరమైన నిధుల కోసం టెస్లా షేర్లు విక్రయించారు. ఇటీవల 3.58 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లు విక్రయించారు. ఎందుకు విక్రయించరాదన్న సమాచారం తెలియకున్నా.. ట్విట్టర్ కొనుగోలు బకాయిలు చెల్లించడానికేనని వార్తలొచ్చాయి.
ట్విట్టర్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్‌మస్క్.. తన టైంలో అత్యధికంగా సోషల్ మీడియా జెయింట్ బాగోగుల కోసమే కేటాయిస్తున్నారని ఆందోళనలో వాటాదారులు ఉన్నారు. టెస్లాను పూర్తిగా ఎలన్‌మస్క్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ట్విట్టర్ భవితవ్యంపై ఎలన్‌మస్క్ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో, దాని ప్రభావం టెస్లా షేర్ విలువ పడిపోతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

