Twitter | మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్ మస్క్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులను శ్రీకారం చుడుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో్ ట్విట్టర్ బ్లూ సహా అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కొత్త సంవత్సరం 2023లో కొత్తగా నావిగేషన్ ఫీచర్ తీసుకోబోతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఫీచర్ సహాయంతో రెఫర్ చేసిన కంటెంట్, ఫాలో ట్వీట్, ఇతర అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను సులభంగా చూడవచ్చని పేర్కొన్నారు.
ఒక ట్వీట్‌కు సమాధానంగా ఏఐలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ట్వీట్లను ఫాలో అవడం, ఇతర కంటెంట్లను చూడడం సరదాగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల 40కోట్ల మంది యూజర్ల డేటా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డార్క్ వెబ్‌లో యూజర్ల డేటాను అమ్మకానికి పెట్టారు. చోరీ చేసిన డేటాలో వినియోగదారుల పేర్లు, ఈ మెయిల్ ఐడీలు, ఫాలోవర్ల సంఖ్య, వినియోగదారుల ఫోన్ నంబర్లు సైతం ఉన్నాయి. ట్విట్టర్ 5.4 మిలియన్ల యూజర్ల డేటా లీక్ అయ్యింది.
New Twitter navigation coming in Jan that allows swiping to side to switch between recommended & followed tweets, trends, topics, etc.
Until then, tap stars icon on upper right of home screen to switch.
— Elon Musk (@elonmusk) December 30, 2022