వినియోగదారుల వివరాలను కాజేయడానికి ఉపయోగపడే ‘ట్రోజన్’ జోకర్ మాల్వేర్ ఉన్న కొన్ని యాప్‌లను గూగుల్ సంస్థ గుర్తించింది. క్యాస్పర్‌స్కై సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన తత్యానా షిస్కోవా అనే అనలిస్ట్ ఈ యాప్స్‌లో ఉన్న మాల్వేర్ను గుర్తించింది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన గూగుల్ సంస్థ.. ప్లేస్టోర్ నుంచి ఈ ఏడు యాప్‌లను తొలగించింది.
ఈ యాప్స్ మన ఫోన్లలోని సెక్యూరిటీ వ్యవస్థను టార్గెట్ చేస్తాయి. ఆ తర్వాత మనకు తెలియకుండానే యాప్స్‌లో ఉన్న ఖరీదైన సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాయి. భారీగా డబ్బు పోయిన తర్వాతగానీ అసలు విషయం వినియోగదారులకు తెలియదు. ఇప్పటికే ఏడు యాప్‌లను బ్యాన్ చేసిన గూగుల్ సంస్థ.. ఇకపై వీటిని ఎవరూ డౌన్లోడ్ చేసుకోలేరని తెలిపింది. అయితే ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వాళ్లు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే నష్టపోతారని హెచ్చరించింది.
గూగుల్ బ్యాన్ చేసిన ఆ ఏడు యాప్స్ ఇవే..