న్యూఢిల్లీ : ఈ ఏడాది జులైలో రానున్న నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. అప్‌కమింగ్ 5జీ ఫోన్ డిస్ప్లే, బ్యాటరీ, చిప్సెట్ వంటి పలు స్పెసిఫికేషన్లను లాంఛ్‌కు నెల రోజుల ముందే రివీల్ చేసింది. నథింగ్ ఫోన్ 2 దీర్ఘకాలం పాటు అండ్రాయిడ్ సాఫ్ట్వేర్ సపోర్ట్‌ను కలిగిఉంటుందని తెలిపింది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్‌ను ట్విట్టర్ వేదికగా కంపెనీ వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 2 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఓఎల్ఈడీ స్క్రీన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. 4700ఏంహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉంటుంది. ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో లేటెస్ట్ ఫోన్ యూజర్లకు మెరుగైన సామర్ధ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
కెమెరా, డిజైన్ సహా ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక నథింగ్ ఫోన్ 2 భారత్‌లో రూ. 40,000లోపు ధరలో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నథింగ్ ఫోన్ 1 భారత్‌లో రూ. 32,999కు ప్రకటించగా ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశీ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది.
Read More