Vivo V29 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) వచ్చేనెలలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లోకి వివో వీ29 ప్రో (Vivo V29 Pro) ఫోన్ ఆవిష్కరించనున్నది. వివో వీ 29 (Vivo V29) తోపాటు వివో వీ29 ప్రో (Vivo V29 Pro), వివో వీ29 లైట్ (Vivo V29 Lite) ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు వివో అధికారికంగా తన వెబ్సైట్లో టీజర్ విడుదల చేసింది. వివో వీ 29 ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో లభ్యమైంది. బుధవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించవచ్చునని తెలుస్తున్నది.
6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 50-మెగా పిక్సెల్ కెమెరా.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా లభ్యం. మరికొన్ని వేరియంట్లలోనూ ఆవిష్కరించే అవకాశం.
ఆండ్రాయిడ్ 13 విత్ వివోప్ ఫన్ టచ్ 13 వర్షన్ మీద ఫోన్ పని చేస్తుంది.
గత మార్చిలో ఆవిష్కరించిన వివో వీ 27 ఫోన్ కొనసాగింపుగా వీ 29 సిరీస్ ఫోన్లను వివో ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తున్నది. వివో వీ27 ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.32,999, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.36,999లకు లభిస్తున్నాయి. వివో వీ 27, వివో వి27 ప్రో ఫోన్లు ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 66 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.