నీటి కోసం గుంతలు తవ్వుతున్న చింపాంజీలు.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు
పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు నడుచుకునే వాడే సుఖంగా బతుకుతాడని పెద్దలు చెప్తారు. ఈ సలహాను తూచా తప్పకుండా కొన్ని చింపాంజీలు పాటిస్తూ సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉగాండాలోని అడవుల్లో కొన్ని చింపాంజీలు నీళ్ల కోసం నేలను తవ్వుతూ కనిపిస్తున్నాయి. మనం కూడా నీళ్ల కోసం బావులు తవ్వుతాం కదా.
అచ్చం ఇలాగే ఈ చింపాంజీలు కూడా ప్రవర్తించడం సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా 2015లో మొదలైనట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఓన్యోఫీ అనే ఒక ఆడ చింపాంజీ ఇక్కడకు వచ్చిన కొంత కాలానికే ఇలా చిన్న చిన్న గుంతలు తవ్వి, వాటిలో నుంచి వచ్చే నీళ్లు తాగడం మొదలు పెట్టింది.
ఇది చూసిన పరిశోధకులు.. ఈ చింపాంజీ ఇలా బావులు తవ్వే కమ్యూనిటీలో పెరిగి ఉండొచ్చని అంచనా వేశారు. ఓన్యోఫీ చేసే పనిని వింతగా చూసిన మిగతా చింపాంజీలు కూడా ఇప్పుడు అదే పని చేయడం మొదలు పెట్టాయి. అంటే అంతకుముందు వరకు ఇక్కడి చింపాంజీలకు అసలు ఈ ఆలోచన కానీ, అలవాటు కానీ లేదన్నమాట.
కానీ ఓన్యోఫీ రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. దీంతో ఇక్కడి వైబిరా కమ్యూనిటీ చింపాంజీలన్నీ ఇప్పుడు ఇలా నీటి కోసం నేలను తవ్వుతూ కనిపిస్తున్నాయి. ఈ పని కేవలం ఆడ చింపాంజీలే చేయడం గమనార్హం. మగ చింపాంజీలు ఇలా గుంతలు తవ్వడం లేదు. ఆడ చింపాంజీలు తవ్వి వదిలేసిన గుంతల్లో నీళ్లు తాగుతున్నాయి.
వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు పడే సమయం, స్థాయి కూడా మారిపోయిందని, ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా బతికేందుకే ఈ చింపాంజీల ప్రవర్తన ఇలా మారిందని పరిశోధకులు భావిస్తున్నారు. వీటిపై పీటర్ అనే పరిశోధకుడు తన టీంతో చేసిన అధ్యయనం వివరాలను ‘ప్రైమేట్స్’ అనే జర్నల్‌లో ప్రచురించడం జరిగింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

