న్యూఢిల్లీ : అందుబాటు ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు, ఆడియో ప్రోడక్ట్స్‌ను రూపొందించే బోల్ట్ దేశీ మార్కెట్లో మరో న్యూ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. డ్రిఫ్ట్, కాస్మిక్, రిడ్జ్ పేరుతో ఇటీవల మూడు స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసిన కంపెనీ తాజాగా బోల్ట్ రోవర్ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రౌండ్ 1.3 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో రోవర్ స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
రూ. 2999కు అందుబాటులో ఉండే బోల్ట్ రోవర్ స్మార్ట్‌వాచ్ క్లాసిక్ స్విచ్, ఫ్లిప్ వెర్షన్స్‌లో లభిస్తోంది. ఇక ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే బోల్ట్ రోవర్ స్మార్ట్‌వాచ్ 100 స్పోర్ట్స్ మోడ్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ పది రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. బోల్ట్ రోవర్ స్మార్ట్‌వాచ్ వాటర్, డస్ట్ నుంచి కాపాడే ఐపీ68 రేటింగ్‌ను కలిగిఉంది.