న్యూఢిల్లీ : ఈ ఏడాది రూ 10,000లోపు స్మార్ట్‌ఫోన్ క్యాటగిరీలో పెద్దగా సందడి లేదు. లో బడ్జెట్ ఫోన్లకు డిమాండ్ ఉండే భారత్ వంటి మార్కెట్లలో ఈ విభాగంలో స్మార్ట్ఫోన్లు పెద్దగా లాంఛ్ కావడం లేదు. ఈ మార్కెట్‌పై పట్టున్న షియోమి, రియల్‌మి సైతం ఈ ఏడాది ప్రధానంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై ఫోకస్ పెట్టాయి. చిప్ కొరత వెంటాడుతుండటం కూడా ఈ క్యాటగిరీలో వృద్ధి మందగించడానికి కారణంగా చెబుతున్నారు. ఇక రూ 10,000లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏంటో చూద్దాం
రియల్‌మి నార్జో 30ఏ
రూ 10,000లోపు ధరలో మెరుగైన స్మార్ట్ఫోన్లలో రియల్‌మి నార్జో 30ఏ ఒకటి. ఇతర బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్ మెరుగైన ఛాయిస్‌గా నిలుస్తుంది. ఇది 6.51 ఇంచ్ హెచ్డీ ప్లస్ హై రిజల్యూషన్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్‌తో పాటు ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆకర్షణగా నిలుస్తుంది. తక్కువ ధరలో భారీ డిస్ప్లే, డీసెంట్ ప్రాసెసర్, మంచి కెమెరాలు, భారీ బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్‌ను మెరుగైన ఎంపికగా నిలిపాయి.
మోటో జీ10 పవర్
మోటో జీ10 పవర్ 6.51 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పాటు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. లేటెస్ట్ అండ్రాయిడ్11పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 6000ఎంఏహెచ్ బ్యాటరీతో ముందుకొచ్చింది.
రెడ్మి 9 ప్రైమ్
ఈ ఏడాది రూ 10,000లోపు స్మార్ట్‌ఫోన్ రెడ్మి 9 ప్రైమ్‌ను షియోమి లాంఛ్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసిన షియోమి ఆపై మిడ్, ప్రీమియం స్మార్ట్‌పోన్లపై దృష్టిసారించింది. ఇక రెడ్మి 9 ప్రైమ్ 6.53 ఇంచ్ హెచ్‌డీప్లస్ మల్టీటచ్ టచ్‌స్క్రీన్‌తో పాటు హైరిజల్యూషన్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. మీడియాటెక్ హెలియో జీ80 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.