Deep Fake| బాలీవుడ్ తారలను సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న డీప్ ఫేక్ నుంచి బయటపడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Deep Fake| డీప్ ఫేక్.. రోజూ వార్తల్లో నానుతున్న విషయం. సంచలనాలు రేపుతున్న సాంకేతికం. చేతిలో సెల్‌ఫోన్.. ఫోన్లో యాప్స్ ఉంటే చాలు. ఎవరికైనా డీప్ ఫేక్ సృష్టించవచ్చు. సామాజిక మాధ్యమాల్లో వదిలేయవచ్చు. నవ్వులాటకు చేసినా సరే.. నేరం నేరమే! మనం ఆడుకుంటున్నది అవతలి వ్యక్తి ఆత్మగౌరవంతో అని మరిచిపోకూడదు. తేడా వస్తే.. కటకటాల పాలే!
Deep Fake| డీప్ ఫేక్.. రోజూ వార్తల్లో నానుతున్న విషయం. సంచలనాలు రేపుతున్న సాంకేతికం. చేతిలో సెల్‌ఫోన్.. ఫోన్లో యాప్స్ ఉంటే చాలు. ఎవరికైనా డీప్ ఫేక్ సృష్టించవచ్చు. సామాజిక మాధ్యమాల్లో వదిలేయవచ్చు. నవ్వులాటకు చేసినా సరే.. నేరం నేరమే! మనం ఆడుకుంటున్నది అవతలి వ్యక్తి ఆత్మగౌరవంతో అని మరిచిపోకూడదు. తేడా వస్తే.. కటకటాల పాలే!
బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. ఎవరూ మినహాయింపు కాదు. సామాన్యులు సైతం ప్రశాంతంగా బతకలేని పరిస్థితి. సోషల్ మీడియా ఖాతా తెరువగానే.. నగ్నంగానో, అర్ధనగ్నంగానో మన ఫొటోలే కనిపించవచ్చు. కాదంటే, మన ఆత్మీయులవీ కావచ్చు. కొన్నిసార్లు మనంతట మనమే ఆ అగాధ అసత్యాల్ని, లోతైన అబద్ధాల్ని, టెక్నాలజీ ముసుగులోని వికృత కృత్రిమత్వాన్ని.. తెలిసిన వారికి, తెలియనివారికి ధారాళంగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. నైతికానైతికాలు పక్కనపెట్టి.. లైక్‌లు చూసుకుని మురిసిపోతాం. కామెంట్లకు కట్టు బానిసలమైపోతాం. సినీనటి రశ్మిక మందన్న ఉదంతమే తీసుకోండి. తనకు మనోబలం ఎక్కువ. ఫేక్‌లను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే మానసిక పరిణతి కూడా ఉంది. అదే ఏ ఇంటర్మీడియట్ అమ్మాయో అయితే? తెల్లారేలోపు ఫ్యాన్‌కు వేలాడుతూనో, పురుగులమందును తాగేసో.. శవమై కనిపించేది. ఆత్మీయులను క్షోభకు గురిచేసేది. ఏ మధ్య తరగతి గృహిణి విషయంలోనో ఇలా జరిగి ఉంటే? కాపురాలు కూలిపోయేవి. వ్యవహారం విడాకుల దాకా వెళ్లేది. ఏది నిజమో, ఏది కల్పితమో అర్థం చేసుకోలేని సమాజానికి ఏం జవాబు చెప్పాలన్న భయమే చాలామందిని సమస్యలపాలు చేస్తున్నది. ఆ వికృత సాంకేతికతను అడ్డుగా పెట్టుకుని.. కట్టలకొద్దీ డబ్బు అడిగేవారు, పశువాంఛ తీర్చమని కోరేవారు, అజ్ఞాతంలోంచే ఆనంద పరవశులయ్యేవారు.. ఇలా మనిషికో బుద్ధి. శత్రువు పక్కనే ఉండవచ్చు. పొరుగు దేశంలోనో, మరో ఖండంలోనో దర్జాగా బతికేస్తూ ఉండవచ్చు. కొందరికి కాలక్షేపం. కొందరికి అక్రమ ఆదాయమార్గం.
అనేక మార్గాలు..
డీప్ ఫేక్ సృష్టించడానికి సాంకేతిక బ్రహ్మలే కానవసరం లేదు. కొద్దిపాటి టెక్నాలజీ సరిపోతుంది. మనకేం కావాలన్నది టైప్ చేయగలిగితే చాలు. టెక్నాలజీ తన పని చేసుకుపోతుంది. మన అంచనాలకు తగిన రూపాన్ని తెర మీద ప్రత్యక్షం చేస్తుంది. ‘ఫేస్‌యాప్’లో ఓ వ్యక్తి రూపురేఖల్ని వివిధ హావభావాలలో సృష్టించుకోవచ్చు. ‘డీప్‌ఫేక్ వెబ్’ పేరుతో ఓ కృత్రిమ ప్రపంచమే ఉంది. ఇవన్నీ ఎదుటి మనిషి ప్రతిరూపాన్ని కల్పించి ఇచ్చే వేదికలే. వీటి సాయంతో నగ్న దృశ్యాలు, చౌకబారు సంభాషణలు సృష్టించడం చాలా సులభం. వాటిని పట్టుకుని ఎవరినైనా బాధించవచ్చు, బెదిరించవచ్చు. బ్లాక్ మెయిల్ చేయవచ్చు. పరువు తీయవచ్చు. అదే జరుగుతున్నదిప్పుడు.
పదునైన చట్టాలు
ఏ ఉద్దేశంతో డీప్‌ఫేక్ చేసినా తప్పు తప్పే. చట్టపరంగా నేరం. సామాజికంగా అనైతికం. ఇండియన్ పీనల్‌కోడ్‌లోని వివిధ సెక్షన్లతోపాటు, ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోని నిబంధనల పరిధిలోనూ కేసులు పెట్టవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000లోని సెక్షన్ 66 డి ప్రకారం.. వ్యక్తిత్వ హననం కిందికి వస్తుంది. మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. లక్ష రూపాయల వరకూ జరిమానా వేయవచ్చు. అదే చట్టంలోని సెక్షన్ 66 ఇ ఇంతకంటే తీవ్రమైన శిక్షను ఖరారు చేస్తుంది. ఒక వ్యక్తి ఏకాంతానికి భంగం కలిగించడం, ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతని శరీర భాగాలను ఫొటో లేదా వీడియో తీయడం.. వాటిని ఇతరులతో పంచుకోవడం.. తీవ్ర నేరాల
పరిధిలోకే వస్తాయి. మూడేండ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు లక్షల వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది. జైలు శిక్ష, జరిమానా.. ఏకకాలంలో రెండూ ఖాయం చేసినా చేయవచ్చు. పసిపిల్లల శరీరాలను అసభ్యంగా చూపినట్టయితే.. మొదటి నేరానికి ఐదేండ్ల వరకూ జైలు శిక్ష, పది లక్షల వరకు జరిమానా ఉంటాయి. తదుపరి నేరాలకు శిక్ష తీవ్రత, జరిమానా మొత్తం అధికం అవుతాయి. ఇండియన్ పీనల్‌కోడ్‌లోని సెక్షన్ 499 కూడా ఇక్కడ వర్తిస్తుంది. దీనికింద రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. కాపీరైట్ చట్టం కింద కూడా తీవ్ర శిక్షలే ఉన్నాయి.
జాగ్రత్తలు మామూలే
డీప్ ఫేక్ అయినా మరో ఆన్లైన్ మోసమైనా.. చాలా సందర్భాల్లో సామాజిక నేరస్థులకు మనమే ముడిసరుకు అందిస్తాం. ప్రశంసల కోసమో, ఓదార్పు కోసమో.. లెక్కలేనన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరితో ఉన్నాం.. ఇలా ప్రతి సమాచారాన్నీ నలుగురితో పంచుకుంటాం. మన ఆస్తిపాస్తుల్ని, సంపదల్ని అందరికీ చూపించి మురిసిపోతాం. అంతిమంగా చేపల్లా గాలానికి చిక్కుకుంటాం. బయటపడటానికి నానా అవస్థలూ పడతాం. కోరికోరి కష్టాల్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. సోషల్ మీడియా అన్నదే ఓ డీఫ్ ఫేక్ ప్రపంచమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేన్నీ నమ్మకండి.
విద్రోహ శక్తులు సమాజంలో చిచ్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ ఛాయా చిత్రాలకు, వీడియోలకు స్పందించే ముందు.. ఒక్క క్షణం ఆలోచించాలి. విచక్షణతో అడుగు ముందుకు వేయాలి. అంతేకానీ, ఆ తీవ్రతకు మరింత ఆజ్యం పోయకూడదు. పౌరులుగా ఇది మన బాధ్యత.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Digital Break | స్మార్ట్‌ఫోన్ ఒక వ్యసనంగా మారిందా.. ఇలా చెక్ చేసుకోండి!
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

