వాషింగ్టన్: ఇక్కడ భూమి మీద అతి పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. మరి పైన స్పేస్‌స్టేషన్ సంగతేంటి? అక్కడా మన ఆస్ట్రోనాట్లు తమదైన స్టైల్లో ఒలింపిక్ గేమ్స్( Space Olympics )ను ఎంజాయ్ చేశారు. అసలు గురుత్వాకర్షణ శక్తి లేని చోట వాళ్లు ఆడిన గేమ్స్ తాలూకు వీడియోలు ఎంతో ఫన్నీగా ఉన్నాయి. జీరో గ్రావిటీలోనూ నాలుగు రకాల ఒలింపిక్ గేమ్స్ ఆడటానికి వాళ్లు ప్రయత్నించారు.
సింక్రొనైజ్డ్ స్పేస్ స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, నో-హ్యాండ్‌బాల్, వెయిట్‌లెస్ షార్ప్ షూటింగ్లాంటి గేమ్స్‌తో ఆస్ట్రోనాట్లు ఎంజాయ్ చేశారు. ఏడుగురు అథ్లెట్లు, నాలుగు గేమ్స్, రెండు టీమ్స్ ఈ తొలి స్పేస్ ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొన్నాయి. అంతేకాదు ఇక్కడ భూమిపై ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ జరిగినట్లే అక్కడ అంతరిక్షంలోనూ క్లోజింగ్ సెర్మనీ జరిపారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెక్క్వెట్ వీటికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.