న్యూఢిల్లీ : యాపిల్ వాచ్ ప్రొను సెప్టెంబర్ 7న లాంఛ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. న్యూ ఐఫోన్ 14 మోడల్స్‌తో కలిపి వాచ్ ప్రొను ఇంట్రడ్యూస్ చేసేందుకు యాపిల్ సన్నద్ధమైంది. ఫిట్నెస్ ఓరియంటెడ్ కస్టమర్ల కోసం న్యూ వాచ్ మోడల్లో అదనపు ఫీచర్లను యాపిల్ జోడించిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. శాంసంగ్ ఇటీవల గెలాక్సీ వాచ్‌ల ప్రొ మోడల్‌ను ఆవిష్కరించడంతో యాపిల్ వాచ్ ప్రొ ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
ఇక న్యూ మోడల్‌ను యాపిల్ వాచ్ ఎక్స్ట్రీమ్ లేదా యాపిల్ వాచ్ మ్యాక్స్ పేరుతో వ్యవహరిస్తారని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. యాపిల్ లేటెస్ట్ వాచ్ ప్రొ| మ్యాక్స్..మెటల్ ఫినిష్‌తో స్క్వేర్ డయల్‌తో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే రోజు లాంఛ్ అవుతుందని భావిస్తున్న వాచ్ 8 సిరీస్‌ను వాచ్ ప్రొ పోలిఉంటుందని చెబుతున్నారు. న్యూ ప్రొ వెర్షన్ స్ట్రాంగ్ మెటల్ మెటీరియల్‌తో షాట్టర్-రెసిస్టెన్స్ స్క్రీన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
sఫీచర్ల విషయానికి వస్తే యాపిల్ వాచ్ ప్రొ మోడల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కలిగిఉంది. మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ డివైజ్ నేరుగా శాటిలైట్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. అయితే ఈ వెసులుబాటును కేవలం సైన్యం, కొన్ని ఎంటర్ప్రైజ్ కస్టమర్లకే పరిమితం చేయడంతో భారత్‌లో ఈ వెసులుబాటు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక స్టాండర్డ్ 8 సిరీస్‌తో పోలిస్తే యాపిల్ వాచ్ ప్రొ లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.