యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ కోసం ఎప్పుడెప్పుడా అని యాపిల్ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ అప్‌గ్రేడెడ్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. గత సంవత్సరం కూడా ఐఫోన్ 12ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని యాపిల్ భావించినా.. కోవిడ్ వల్ల అది కుదరలేదు. లేట్‌గా ఐఫోన్ 12 సిరీస్‌ను రిలీజ్ చేసింది యాపిల్.
అయితే.. ఈ సంవత్సరం మాత్రం లేట్ కాకుండా.. సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 13 సిరీస్‌ను రిలీజ్ చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా.. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ ఫోన్లను యాపిల్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 14న యపిల్.. ఐఫోన్ 13 సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 13 ప్రీఆర్డర్స్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
ఐఫోన్ 13 లాంచ్ తర్వాత సెప్టెంబర్ 30న యాపిల్ ఎయిర్‌పాడ్స్ 3ని రిలీజ్ చేయనున్నారు. ఇక.. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో ఫేస్ ఐడీ హార్డ్‌వేర్ ఫీచర్ ఉంటుంది. మాస్క్ వేసుకున్నా.. గ్లాసెస్ పెట్టుకున్నా కూడా ఫేస్ ఐడీతో ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అలాగే.. ఐఫోన్ 13 ప్రో మోడల్స్ 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో లభించనున్నాయి.