iPhone 12 : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్12పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..!
ఐఫోన్12పై భారీ డిస్కౌంట్ | ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13ను యాపిల్ లాంచ్
ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13ను యాపిల్ లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 13ను యాపిల్ విడుదల చేయనుంది. ఈనేపథ్యంలో.. ఐఫోన్ 12 సేల్స్ తగ్గకూడదని.. ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

128జీబీ మోడల్ ఐఫోన్ ధర ప్రస్తుతం రూ.84900 ఉండగా.. డిస్కౌంట్‌తో రూ.71,999 కే ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు. దానితో పాటు.. ఇంకా ఇన్స్టంట్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కింద 15 వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల ద్వరా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. నెలకు 12 వేల రూపాయల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 12.. ఐదు కలర్లలో ప్రస్తుతం లభిస్తోంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. 64 జీబీ మోడల్ ఫోన్ ధర రూ.79,900 ఉండగా… ప్రస్తుతం రూ.66,999 కే అందిస్తున్నారు. 256 జీబీ వేరియంట్ ధరను రూ.94,900 నుంచి రూ.81,999 కే అందిస్తున్నారు. ఐఫోన్ 12 మినీ మీద కూడా భారీ డిస్కౌంట్‌ను యాపిల్ అందిస్తోంది.
ఐఫోన్ 12లో 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 12 ఎంపీ రేర్ కెమెరా(4కే వీడియో సపోర్ట్), 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ14 బయోనిక్ చిప్సెట్ 5జీ మోడెమ్, మాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
Realme Pad : రియల్ మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
Realme 8i and 8s : క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి 8ఐ, 8ఎస్ ఫోన్లు విడుదల.. ధర ఎంతంటే?
Over The Air Wireless Charging : ఒకేసారి 4 ఫోన్లకు చార్జింగ్.. మోటరోలా సరికొత్త ఎయిర్ చార్జర్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

