Realme 8i and 8s : క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి 8ఐ, 8ఎస్ ఫోన్లు విడుదల.. ధర ఎంతంటే?
క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి 8ఐ, 8ఎస్ ఫోన్లు విడుదల | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ నుంచి తాజా 8ఐ, 8ఎస్ మోడల్స్ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వర్చువల్ ఈవెంట్ ద్వారా రియల్ మీ పాడ్, బ్లూటూత్ స్పీకర్లతో

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ నుంచి తాజా 8ఐ, 8ఎస్ మోడల్స్ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వర్చువల్ ఈవెంట్ ద్వారా రియల్ మీ పాడ్, బ్లూటూత్ స్పీకర్లతో పాటు.. రియల్ మీ 8ఐ, 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు. రెండు స్మార్ట్ ఫోన్లు.. హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్, క్యారీ ట్రిపుల్ రేర్ కెమెరాలను కలిగి ఉంటాయి.

రియల్ మీ 8ఐ ధరను ఇండియాలో రూ.13,999గా నిర్ణయించారు. అది బేసిక్ వేరియంట్. 4జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్ అది. 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఫోన్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 14 నుంచి రియల్ మీ 8ఐ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

రియల్ మీ 8ఎస్ 5జీ ఫోన్ ధర.. 6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ కు గాను 17,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. రియల్ మీ 8ఎస్ సేల్స్.. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి.
రియల్ మీ 8ఐ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), రియల్ మీ యూఐ 2.0, ఆండ్రాయిడ్ 11, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 90.80 స్క్రీన్ టు బాడీ రేషియో, 100 శాతం డీసీఐ పీ3 కలర్ గాముట్, డ్రాగన్ ట్రేల్ ప్రో ప్రొటెక్షన్, 180 హెచ్ జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, మీడియాటెక్ హీలియో జీ96 ఎస్వోసీ, 50 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏఐ సపోర్ట్, హెచ్డీఆర్ మోడ్, డ్యుయల్ బాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు 8ఐలో ఉంటాయి.

రియల్ మీ 8ఎస్ ఫీచర్స్
ఆండ్రాయిడ్ 11, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 90 హెచ్ జెడ్ రీఫ్రెష్ రేట్, 180 హెచ్ జెడ్ సాంప్లింగ్ రేట్, 90.5 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షిటీ 810 ఎస్వోసీ, 5జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్, 64 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ లాంటి ఫీచర్లతో 8ఎస్ విడుదల అయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

