న్యూయార్క్ : ఎమర్జెన్సీ సమయాల్లో హెల్త్ అలర్ట్స్తో పలువురి యూజర్ల ప్రాణాలను యాపిల్ వాచ్ (Apple Watch) కాపాడిన ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తుండగా మరికొన్ని హెల్త్ ఫీచర్లను స్మార్ట్‌వాచ్‌లో చేర్చేందుకు యాపిల్ సన్నాహాలు చేపట్టింది. యూజర్ల హార్ట్ రేట్‌ను నిరంతరం పసిగట్టే యాపిల్ వాచ్ ఏమాత్రం తేడాలను గమనించినా అలర్ట్ చేస్తున్న క్రమంలో న్యూ హెల్త్ ఫీచర్లను జోడించి వారికి మరింత దగ్గరయ్యేందుకు కసరత్తు సాగిస్తోంది.
తమ హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గలను యాపిల్ వాచ్ పసిగట్టి తమ ప్రాణాలు కాపాడిందని కస్టమర్లు చెబుతుంటారు. అయితే కేవలం శారీరక ఆరోగ్యానికే పరిమితం కాకూడదని భావిస్తున్న యాపిల్ యూజర్ల మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 వేదికగా ఐఓఎస్ 17, ఐపాడ్ఓఎస్ 17, వాచ్ఓఎస్ 10కు సంబంధించి నూతన హెల్త్ ఫీచర్లను యాపిల్ ప్రకటించింది.
జూన్ 5న జరిగిన యాపిల్ మెగా యాన్యువల్ ఈవెంట్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 వేదికగా ఈ ఫీచర్లను టెక్ దిగ్గజం వెల్లడించింది. రాబోయే రోజుల్లో యాపిల్ వాచ్, ఐపాడ్, ఐఫోన్ యూజర్లు తమ డివైజ్‌లో తమ భావోద్వేగాలు, మూడ్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. నిపుణులు సహా ఇతర వనరుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించే వెసులుబాటు కూడా యూజర్లకు లభించనుంది.
Read More
AI-generated images | ఏఐ మాయ.. దేశాధినేతలు చిన్నారులైతే ఇలా ఉంటారు..!