AI-generated images | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీ (ChatGPT)కి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ (AI) ప్రభావం చూపుతోంది. టెక్ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్ల ఊహా శక్తికీ ఏఐ (AI) రెక్కలు తొడుగుతోంది. ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన చిత్రాలు (AI-generated images ) , వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత కుబేరులు బికారులైతే (పేదవారు) ఎలా ఉంటారు, స్టార్ క్రికెటర్లు, స్టార్ హీరోలు అమ్మాయిలైతే ఎలా ఉంటారో ఊహిస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు ఇప్పటికే నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ దేశాల అధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో (world leaders as toddlers) వీడియో రూపంలో ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఏఐ మాయతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు నేతలు చిన్నారుల్లా మారిపోయారు. ప్రస్తుతం చిన్నారులుగా మారిపోయిన దేశాధినేతల చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Golden Temple | ఆపరేషన్ బ్లూ స్టార్.. గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం
Hyderabad | మద్యం మత్తులో ఫ్లైఓవర్ పై నుంచి దూకిన వ్యక్తి