Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
ఆపిల్ ఐఫోన్ 13 ( Apple iPhone 13 ) సిరీస్ ప్రిబుకింగ్స్ ఇండియాలో శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి.

ముంబై: ఆపిల్ ఐఫోన్ 13 ( Apple iPhone 13 ) సిరీస్ ప్రిబుకింగ్స్ ఇండియాలో శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ వారం మొదట్లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌లను ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 12తో పోలిస్తే ఈ లేటెస్ట్ మోడల్ పలు అప్డేట్స్తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎక్కడ బుక్ చేసుకోవాలి?
ఈ ఐఫోన్ 13 సిరీస్ ప్రిబుకింగ్స్ను ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు ఆన్లైన్, ఇ-కామర్స్ సైట్లలోనూ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆపిల్ డిస్ట్రిబ్యూటర్ ఇన్‌గ్రామ్ మ్యాక్రో తన 3200 లొకేషన్లలో ఈ కొత్త మోడల్‌ను విక్రయించనుంది. అటు మరో డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ 3500 లొకేషన్లకు షిప్ చేస్తోంది. ఇవి కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ప్రిఆర్డర్లు ఇవ్వొచ్చు.
ధర ఎంత?
ఐఫోన్ 13 సిరీస్ ఇండియాలో రూ.69,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 మినీ 128 జీబీ ఈ ధరలో లభిస్తుంది. ఇక 256 జీబీ ధర రూ. 79,900, 512 జీబీ ధర రూ.99,900గా నిర్ణయించారు. ఇక అత్యధికంగా ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 1 టీబీ వేరియంట్ ధర రూ.1,79,900గా ఉండటం విశేషం. ఈ ఫోన్లను ఆపిల్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర హెచ్డీఎఫ్సీ కార్డులు ఉపయోగించి ప్రిబుకింగ్స్ చేసేవాళ్లకు మోడల్‌ను బట్టి రూ.6 వేలు, రూ.5 వేలు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఇక కొన్ని రిటెయిల్ అవుట్లెట్లు అదనంగా రూ.3 వేల వరకూ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

