Apple iPhone 12 : భారీగా తగ్గిన ఐఫోన్ 12 ధరలు.. తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోండి
భారీగా తగ్గిన ఐఫోన్ 12 ధరలు | ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఐఫోన్ 12 ధరలు భారీగా తగ్గాయి. ఇటీవలే ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఐఫోన్ 12 ధరలు భారీగా తగ్గాయి. ఇటీవలే ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్ లవర్స్ అంతా.. ఐఫోన్ 13 మీద పడ్డారు. ఐఫోన్ 13ను బుక్ చేస్తున్నారు. దీంతో ఐఫోన్ 12 సేల్స్ బాగా తగ్గాయి. అందుకే.. యాపిల్.. ఐఫోన్ 12 మీద భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీంతో ఐఫోన్ 12 ధరలు భారీగా తగ్గాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్టుతో పాటు.. ఇతర ఈకామర్స్ సంస్థలు తక్కువ ధరకే ఐఫోన్ 12ను అమ్ముతున్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ధర ఇంకా తక్కువ కానుంది. ఐఫోన్ 12 వెనీలా మోడల్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర రూ.79,900 ఉండగా.. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.63,999 కే అమ్ముతున్నారు. అంటే.. రూ.15,901 డిస్కౌంట్ లభిస్తోందన్నమాట.

128 జీబీ మోడల్ ఐఫోన్ 12 ధర రూ.84,900 ఉండగా.. తాజాగా దీన్ని రూ.68,999కే విక్రయిస్తున్నారు. 256 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.78,999 గా ఉంది.

ఐఫోన్ 12 మినీ ఫోన్ల ధరలను కూడా తగ్గించారు. 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.69,900 ఉండగా.. ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ.56,999కే అందిస్తున్నారు. 128 జీబీ వేరియంట్ ఫోన్‌ను రూ.61,999గా నిర్ణయించారు.

ఇక.. ఐఫోన్ 12 ప్రో మోడల్ ఫోన్ల సేల్స్‌ను ఐఫోన్ 13 లాంచ్ తర్వాత యాపిల్ సంస్థ ఆపేసింది. అయినప్పటికీ.. ఉన్న స్టాక్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ మీద కూడా 10 వేల డిస్కౌంట్ లభిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

