Apple iPad Pro 2025 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ పలు నూతన ఐప్యాడ్ మోడల్స్‌ను లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఎం5 చిప్ కలిగిన లేటెస్ట్ ఐప్యాడ్ ప్రొ లను యాపిల్ లాంచ్ చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 11, 13 ఇంచుల డిస్ప్లే సైజ్‌లలో ఈ ఐప్యాడ్లను విడుదల చేశారు. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో 9 కోర్ సీపీయూ లభిస్తుంది. 12జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. అలాగే 1టీబీ, 2టీబీ స్టోరేజ్ మోడల్స్‌లో 10 కోర్ సీపీయూ లభిస్తుంది. 16జీబీ వరకు ర్యామ్‌ను పొందవచ్చు. గతేడాది రిలీజ్ అయిన ఐప్యాడ్ ప్రొ మోడల్స్ కన్నా ఈ మోడల్స్ 30 శాతం ఎక్కువ వేగంగా పనిచేస్తాయని యాపిల్ తెలియజేసింది. ఈ ఐప్యాడ్లకు గాను ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల వీటిని 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను హై వాటేజ్ కలిగిన యాపిల్ యూఎస్బీ టైప్ సి పవర్ అడాప్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే 60 వాట్ల పవర్ అడాప్టర్‌ను కూడా చార్జింగ్ కోసం ఉపయోగించవచ్చు.
11 ఇంచుల ఐప్యాడ్ ప్రొ లో 11 ఇంచుల డిస్ప్లే 2420 x 1668 రిజల్యూషన్ తో లభిస్తుంది. అలాగే 13 ఇంచుల ఐప్యాడ్ ప్రొలో 13 ఇంచుల డిస్ప్లే 2752 x 2064 రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ రెండు డిస్ప్లేలు ఓలెడ్ తరహాకు చెందినవి కావడం విశేషం. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా వీటికి 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు. అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా లభిస్తుంది. కనుక డిస్ప్లేలు చాలా నాణ్యంగా ఉంటాయి. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ రెండు ఐప్యాడ్‌లలోనూ యాపిల్ ఎం5 చిప్సెట్ ను ఏర్పాటు చేశారు. దీన్ని ఈ ఏడాది మాక్ బుక్ ప్రొ ల్యాప్ టాప్ల కోసం రిలీజ్ చేయడం విశేషం. ఇదే ప్రాసెసర్‌ను ఈ ఐప్యాడ్‌లలోనూ అందిస్తున్నారు. అందువల్ల ఈ ఐప్యాడ్లు వేగంగా పనిచేస్తాయి. అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి.
ఈ ఐప్యాడ్లను 12జీబీ, 16జీబీ ర్యామ్ ఆప్షన్లలో రిలీజ్ చేశారు. 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఈ ఐప్యాడ్లలో ఐప్యాడ్ ఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ముందు వైపు కూడా 12 మెగాపిక్సల్ కెమెరా ఉంది. క్వాడ్ స్పీకర్లను, మైక్రోఫోన్స్‌ను ఇచ్చారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. 11, 13 రెండు ఇంచుల మోడల్స్‌లోనూ వైఫై, సెల్యులార్ వేరియెంట్లు అందుబాటులో ఉన్నాయి. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి, ఫేస్ ఐడీ, యాపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీబోర్డుకు సపోర్ట్ వంటి ఫీచర్లను సైతం వీటిల్లో అందిస్తున్నారు. ఇక ఈ ఐప్యాడ్ మోడల్స్ సుమారుగా 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది.
ఐప్యాడ్ ప్రొ 2025 మోడల్స్ కు చెందిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఐప్యాడ్ ప్రొ 11 ఇంచుల వైఫై మోడల్ 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.99,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,19,900గా ఉంది. 1టీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.1,59,900గా నిర్ణయించారు. అలాగే ఐప్యాడ్ ప్రొ 11 ఇంచుల సెల్యులార్ మోడల్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,19,900గా ఉంది. 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,39,900 ఉండగా, 1టీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,79,900గా ఉంది. ఐప్యాడ్ ప్రొ 13 ఇంచుల వైఫై మోడల్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,29,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,49,900గా ఉంది. 1టీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.1,89,900గా నిర్ణయించారు. అలాగే ఐప్యాడ్ ప్రొ 13 ఇంచుల సెల్యులార్ మోడల్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,49,900గా ఉంది. 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,69,900 ఉండగా, 1టీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.2,09,900గా ఉంది. ఈ ఐప్యాడ్ మోడల్స్‌ను యాపిల్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఆథరైజ్డ్ స్టోర్స్, రిటెయిల్ స్టోర్స్‌లో అక్టోబర్ 22 నుంచి విక్రయించనున్నారు.