iOS 15 : ఐఫోన్ ఉందా? ఐఓఎస్ 15 తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్స్ కోసం సిద్ధంగా ఉండండి..!
iOS 15 | మార్కెట్ లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ ఐఫోనే. ఆ ఫోన్ ను అప్పు చేసి అయినా కొనాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా యూత్ అయితే i phone అంటేనే పడి చచ్చిపోతారు
మార్కెట్ లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ ఐఫోనే. ఆ ఫోన్ ను అప్పు చేసి అయినా కొనాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా యూత్ అయితే ఐఫోన్ అంటేనే పడి చచ్చిపోతారు. యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఏ ప్రాడక్ట్ అయినా సరే.. దానికి ఉండే డిమాండే వేరు. ఇప్పటి వరకు మార్కెట్లోకి ఎన్నో బ్రాండ్స్ వచ్చాయి.. పోయాయి కానీ.. ఐఫోన్ ( i Phone ) మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది.

యాపిల్ ఫోన్ మీద యూత్ ఎక్కువగా మక్కువ చూపడానికి కారణం.. ఆ ఫోన్ లో ఉండే ఫీచర్స్. ఆ ఫోన్ లో ఉండే అత్యాధునికమైన ఫీచర్స్ మరే ఫోన్ లో ఉండవు. అయితే.. ఇప్పటికే ఐఫోన్ వాడుతున్నవాళ్లకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఉన్న ఫీచర్స్ తో పాటు మరిన్ని సూపర్ డూపర్ ఫీచర్స్ తో మరోసారి యాపిల్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతోంది.
ప్రస్తుతం ఐఫోన్ లో వాడే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 14.7.1 ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో కూడా కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసినా.. త్వరలో రిలీజ్ చేయబోయే ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంకా మరిన్ని ఫీచర్స్ ను యాపిల్ కంపెనీ తీసుకురాబోతోంది.
వచ్చే నెల అంటే సెప్టెంబర్ లోనే iOS 15 ఓఎస్ లాంచ్ తో పాటు ఐఫోన్ 13 ను కూడా కంపెనీ లాంచ్ చేయనుందట. అయితే.. ఐఓఎస్ 15 తో పాటు వచ్చే సరికొత్త ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
FaceTime Calling
వీడియో కాలింగ్ ఫీచర్ ను ఐఓఎస్ 15 లో అప్ డేట్ చేసింది. ఫేస్ టైమ్ అనే ఫీచర్ లో వీడియో కాల్ పార్టిసిపెంట్స్ ను గ్రిడ్ వ్యూలో చూడొచ్చు. ఫేస్ టైమ్ లింక్స్ ను క్రియేట్ చూసి యూజర్స్ తమ ఫ్రెండ్స్ ను, కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవాళ్లను వీడియో చాట్ కోసం ఆహ్వానించవచ్చు. ఆ లింక్ ద్వారా వేరే వాళ్లు.. ఆ వీడియో చాట్ లో యాడ్ కావచ్చు.
SharePlay
షేర్ ప్లే ఫీచర్ ను ఉపయోగించి ఒక యాపిల్ డివైజ్ నుంచి ఇంకో యాపిల్ డివైజ్ కు సినిమాలు, మ్యూజిక్ ను షేర్ చేసుకోవచ్చు. డివైజ్ స్క్రీన్ ను కూడా ఈ ఫీచర్ ఉపయోగించి షేర్ చేయొచ్చు. యాపిల్ టీవీ ప్లస్ యాప్ నుంచి ఈ ఫీచర్ ద్వారా మూవీస్, టీవీ షోలను షేర్ చేసే విధంగా షేర్ ప్లే అనే ఆప్షన్ ను యాపిల్ తీసుకురానుంది.
Apple Maps
యాపిల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్ ను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 3డీ లాండ్ మార్క్స్, నైట్ మోడ్, డ్రైవింగ్ డైరెక్షన్స్, రోడ్ కలర్స్ లాంటి కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసింది. యూజర్ లొకేషన్ కు సమీపంలో ఉండే ల్యాండ్ మార్క్ ను పిన్ చేస్తే.. యూజర్.. ఆ లొకేషన్ కు చేరుకోగానే డెస్టినేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.
Notifications
నోటిఫికేషన్స్ ను మేనేజ్ చేసుకునే ఫీచర్ ను ఐఓఎస్ 15 లో తీసుకురానున్నారు. ఐఫోన్ యూజర్ కు ఏ నోటిఫికేషన్స్ కావాలి… ఏ నోటిఫికేషన్స్ వద్దో స్పెసిఫిక్ గా సెట్ చేసుకుంటే.. దానికి సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది.
Apple iMessage
ఐమెసేజ్ ఫీచర్ ను ఐఓఎస్ 15 లో అప్ గ్రేడ్ చేశారు. Shared with you అనే ఫోల్డర్ లో యూజర్ షేర్ చేసిన ఆర్టికల్స్, ఫోటోలు, ప్లే లిస్ట్ యాడ్ అవుతాయి. యూజర్ కాంటాక్ట్ లో ఉన్నవాళ్లు షేర్ చేసినవి కూడా అదే ఫోల్డర్ లో యాడ్ అయి ఉంటాయి. దీని వల్ల.. ఈజీగా షేర్ చేసిన మీడియా ఫైల్స్ ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

