న్యూఢిల్లీ : చైనాలో కొవిడ్-19 నియంత్రణలతో హైఎండ్ ఐఫోన్ 14 మోడల్స్ సరఫరాలు తగ్గుముఖం పడతాయని యాపిల్ స్పష్టం చేసింది. చైనాలో కరోనా కట్టడికి కఠిన నియంత్రణలు అమలు చేయడంతో ఉత్పత్తి దెబ్బతినడంతో ఏడాది చివర హాలిడే సీజన్లో ఐఫోన్ 14 హైఎండ్ మోడల్స్ సేల్స్ పడిపోతాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
న్యూ ఐఫోన్లకు డిమాండ్ పెరిగిన సమయంలో ఉత్పత్తి, సరఫరా ఆటంకాలు ఎదురవడం యాపిల్‌కు ఇబ్బందికరంగా మారింది. చైనా జీరో కొవిడ్-19 పాలసీ కారణంగా పలు గ్లోబల్ టెక్ సంస్ధలు డ్రాగన్‌లో తమ స్టోర్స్‌ను మూసివేయడంతో పాటు ఏడాది అంచనాలను సవరించాయి.
ఇక చైనాలో ఐఫోన్ 14 హైఎండ్ మోడల్స్ తయారీ దెబ్బతింది. తగ్గించిన కెపాసిటీతో ఫ్యాక్టరీ నడుస్తోందని యాపిల్ వెల్లడిచింది. ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్స్‌కు మెరుగైన డిమాండ్ ఉన్నా ప్రొడక్షన్ తగ్గడంతో షిప్‌మెంట్స్ తగ్గుతాయని యాపిల్ ఓ ప్రకటనలో పేర్కొంది.