న్యూయార్క్ : టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారిన ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌కు దీటుగా యాపిల్ జీపీటీగా (Apple GPT AI) పిలిచే ఏఐ టూల్‌ను వచ్చే ఏడాది లాంఛ్ చేసేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది. ఈ తరహా టూల్స్‌ను తయారుచేసే ఫ్రేమ్‌వర్క్‌ను యాపిల్ నెలకొల్పుతోంది. యాపిల్ తన ఏఐ టూల్‌ను యూజర్ల కోసం విడుదల చేస్తుందా లేదా అనేది ఇంకా వెల్లడికాలేదు.
తన కీలక డేటా సురక్షితంగా ఉండేందుకు టెక్ దిగ్గజం తన ఉద్యోగులను చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను వాడేందుకు అనుమతించడం లేదు. ఏఐ విభాగంలో వెనకబడటం పట్ల యాపిల్ కలత చెందుతోందని చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ వైపు ప్రజలు మొగ్గుచూడంతో న్యూ ఏఐ టూల్‌ను సిద్ధం చేసేందుకు కసరత్తు సాగిస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. చాట్‌జీపీటీ తరహా పనితీరు కలిగిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపింది.
ఈ టూల్ ద్వారా యూజర్లు ప్రశ్నలు అడిగి వివిధ టాపిక్స్‌పై సమాధానాలు రాబట్టేలా ఉపకరిస్తుందని సమాచారం. యాపిల్ తన మౌలిక వసతులు, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో పాటు గూగుల్ మెషీన్ లెర్నింగ్ యంత్రాంగాన్ని వినియోగిస్తూ న్యూ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ దిశగా జాబ్ ఓపెనింగ్స్‌ను కూడా ఐఫోన్ మేకర్ పోస్ట్ చేయడం గమనార్హం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ పట్ల లోతైన అవగాహన కలిగిన అభ్యర్ధులు అవసరమని డిస్క్రిప్షన్లో యాపిల్ పేర్కొందని తెలిసింది.
Read More :
Hyderabad | హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. ఇక సిటీ బస్సు ఎక్కడుందో చిటికెలో తెలుసుకోవచ్చు