జోరందుకున్న ధాన్యం కొనుగోళ్లు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పించి ధాన్యం సేకరిస్తున్నారు.
- రంగారెడ్డి జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగు
- 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణకు అడుగులు
- తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని సర్కార్ ప్రకటన
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పించి ధాన్యం సేకరిస్తున్నారు. మొత్తం 37 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ఇటీవల మూడు దఫాలుగా వర్షం పెద్దఎత్తున కురిసింది. దీని ద్వారా రైతులకు భారీ స్థాయిలో పంట నష్టం ఏర్పడింది. కల్లాలలోనూ, పంట పొలాల్లోనూ ధాన్యం పెద్దమొత్తంలో నేలపాలై రైతుల చేతికి అందకుండా, వర్షానికి తడిసిపోయింది. గత మాసంలోనే ధాన్యానికి సంబంధించిన కొనుగోళ్లు షురూ అయ్యాయి. యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున, సర్కారు సూచించిన మేరకు మార్గదర్శకాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలో రబీ కాలంలో పలు రకాల పంటల సాగు 78,712 ఎకరాల్లో కొనసాగింది. అందులో ప్రధానంగా 65,190 ఎకరా(26,392.788 హెక్టార్లలో)ల్లో వరి పంట సాగు చేశారు. దిగుబడి కూడా అంతకు మించి వస్తుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే, అకాల వర్షాలకు నేలపాలైన పంటలకు ఒక ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా తడిసి ముైద్దెన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు ముందుకొచ్చి అన్నదాతకు అండగా నిలిచింది.
కొనుగోళ్లు లక్షా63వేల45 మెట్రిక్ టన్నులను మించేలా..
యాసంగి కాలంలో సాగైన వరి పంటల ద్వారా జిల్లావ్యాప్తంగా లక్షా63వేల45 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారుల అంచనా. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాలకు తరలి రానున్న వరి ధాన్యం గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.2,060, గ్రేడ్ ‘బీ’ రకానికి రూ. 2,040 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఆయా పీపీసీ కేంద్రాలన్నింటికీ 15 లక్షల గన్నీ బ్యాగులను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసింది. ధాన్యం కొనుగోలును ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేస్తే నెల రోజులైనా డబ్బులు చేతికి అందేవికావు. చెక్కులిచ్చినా వారం పది రోజుల వరకు చెల్లుబాటుకాకపోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, నాలుగైదు రోజుల వ్యవధిలోనే రైతులకు డబ్బులు జమవుతున్నాయి.
అన్ని రకాల ధాన్యానికి కొనుగోలు కేంద్రాలే కేంద్రం
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
అకాల వర్షాల కారణంగా రైతులు నానా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు కాలాన్ని తప్పి వర్షాలు పడ్డాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షానికి 3,371 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా 2,345 మంది రైతులకు ఇబ్బందులు కలిగాయి. రైతులెవరూ అధైర్యపడొద్దు. ధాన్యం నాణ్యతా ప్రమాణాలు, తేమ తొలగించే అంశం, తాలు నిర్మూలించడానికి ప్యాడీ క్లీనర్ల వినియోగం తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు పెద్దఎత్తున రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సమష్టిగా పని చేయాలని సంబంధిత అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వారికి సూచించాం.
రైతులకు అండగా సీఎం కేసీఆర్ : కట్ట నారయ్య, మాడుగుల
కేసీఆర్ సార్ రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు చేయడం చానా మంచి విషయం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు. కేంద్ర ప్రభుత్వం కొనని ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు కొంటున్నది. తుఫాన్లు, పెద్ద పెద్ద వర్షాలు రావడంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తడిసి ముక్కిన ధాన్యాన్ని కూడా కేసీఆర్ సార్ పెద్ద మనసు చేసుకొని తీసుకోవడం అభినందనీయం. దేశంలో ఏ ప్రభుత్వము కూడా ఇలా చేయడంలేదు. ఒక్క కేసీఆర్ తప్ప.
రైతు బాగుంటే చాలనుకునేవారు కేసీఆర్ సార్ : కాసా పెద్దయ్య, నల్లచెరువు
కేంద్రం కాదంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు సాహసం చేయడం మంచి పరిణామం. రైతుల గురించి ఇంతగా పట్టించుకున్న పాలకులు దేశంలో ఎక్కడ వెతికినా దొరకరు. అకాల వర్షం కారణంగా నేను కూడా ఇబ్బందులకు గురయ్యాను. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ సీఎం కావడం ప్రజల అదృష్టం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను అక్కున చేర్చుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. కేసీఆర్ సార్ పాలన అరమరికలు లేనిది. సామాన్య పౌరుడికి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. రైతులు బాగుంటేనే జన బాహుళ్యం బాగుంటుందని నమ్మినవారు సీఎం కేసీఆర్ సార్.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

